Moviesమాజీ ప్రేయ‌సి చేసిన ప‌నికి స్ట‌న్ అయిన స‌ల్మాన్ ( వీడియో...

మాజీ ప్రేయ‌సి చేసిన ప‌నికి స్ట‌న్ అయిన స‌ల్మాన్ ( వీడియో వైర‌ల్ )

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌రే. 55 సంవత్సరాలు వస్తున్న సల్మాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల కెరీర్లో సల్మాన్ నడిపిన ప్రేమాయ‌ణానాల లిస్టు తీస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎంతో మంది హీరోయిన్లను ప్రేమించిన సల్మాన్ ఎవరిని తన జీవిత భాగస్వామిగా చేసుకోలేకపోయాడు. సల్మాన్ ఖాన్ కు ఇష్టం ఉన్నన్ని రోజులు ప్రేమించేవాడు.. ఆ తర్వాత వాళ్లకు బ్రేకప్ చెప్పేసేవాడు.. మళ్ళీ కొత్త హీరోయిన్ ను పట్టుకుని ఆమెతో ప్రేమాయణం కొనసాగించేవాడు.

తాజాగా సల్మాన్ తన సోదరి అర్పితాఖాన్ – ఆయుష్ శర్మ దంపతులు ఇచ్చిన ఈద్ పార్టీకి వెళ్ళాడు. ఈ పార్టీకి ప‌లువురు సెల‌బ్రిటీలు వచ్చారు. వీరిలో స‌ల్మాన్ మాజీ ప్రేయ‌సి, బాలీవుడ్ మాజీ హీరోయిన్ సంగీతా బిజ్లూనీ కూడా వ‌చ్చారు. అత‌డి వెన‌కాలే వ‌చ్చిన సంగీత స‌ల్మాన్ ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చింది. స‌ల్మాన్ అవేవి ప‌ట్టించుకోకుండా మ‌రొక‌రితో మాట్లాడుతూ ఉండ‌డంతో ఆమె మ‌రోసారి స‌ల్మాన్ ముఖంపై ఒక్క‌టి ఇచ్చింది. దీంతో స‌ల్మాన్ చిరున‌వ్వులు చిందించాడు.

అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. స‌ల్మాన్ ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా ఉండ‌డానికి ఆమే కార‌ణం అని కామెంట్లు పెడుతున్నారు. స‌ల్మాన్‌తో ఎంగేజ్మెంట్ ర‌ద్దు చేసుకుని మ‌రీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌ను ఆమె పెళ్లి చేసుకుంద‌ని అంటున్నారు. అజార్‌కు అప్ప‌టికే నౌరీన్‌తో పెళ్ల‌య్యింది. సంగీత ప్రేమ‌లో ప‌డ‌డంతో నౌరీన్‌కు విడాకులు ఇచ్చేసి మ‌రీ ఆమెను పెళ్లాడాడు.

స‌ల్మాన్ – సంగీత ఏకంగా 10 ఏళ్ల‌కు పైగా డేటింగ్ చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకోవ‌డ‌మే ఆల‌స్యం అనుకుంటోన్న టైంలో బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు. త‌ర్వాత సంగీత అజార్‌ను పెళ్లి చేసుకుంది. 14 ఏళ్ల కాపురం త‌ర్వాత వీరు 2010లో విడాకులు తీసుకున్నారు. అజార్ గుత్తా జ్వాల‌తో డేటింగ్‌లో ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం అన్న గుస‌గుస‌లు వినిపించాయి. వీరు ఎంత విడిపోయినా త‌ర‌చూ క‌లుస్తూనే ఉంటారు.

https://www.instagram.com/reel/CrXhASMAV2Z/?utm_source=ig_web_copy_link

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news