Moviesఎన్టీఆర్ - బాల‌య్య క‌లిసి చేసిన సినిమాలు ఎన్నో తెలుసా…!

ఎన్టీఆర్ – బాల‌య్య క‌లిసి చేసిన సినిమాలు ఎన్నో తెలుసా…!

ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు. అందుకే ఆయన నట సౌర్వ‌భౌముడిగా తిరుగులేని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం 9 నెలల వ్యవధిలోనే సీఎం అయి రికార్డు క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ. తండ్రికి తగ్గ తనయుడుగా సినిమా రంగంలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. గత 46 సంవత్సరాలుగా బాలయ్య టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. తండ్రి లాగా రాజకీయాల్లోకి వచ్చి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. ఇక బాలయ్య – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసుకుందాం.

1- తాత‌మ్మ‌క‌ల‌:
తాత‌మ్మ‌క‌ల 1974లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మకల సినిమాతో బాలకృష్ణ నటుడుగా తెరంగేరేటం చేశారు. ఈ సినిమాలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కనబరిచారు. తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్లో బాలయ్యకు ఇది తొలి సినిమా కాగా సూపర్ హిట్ అయింది.
2- అన్నదమ్ముల అనుబంధం :
తండ్రి ఎన్టీఆర్ తో బాలయ్య చేసిన రెండో సినిమా అన్నదమ్ముల అనుబంధం. నిజజీవితంలో తండ్రి కొడుకులైన ఎన్టీఆర్ బాలయ్య ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు.
3 – వేములవాడ భీమకవి :
బాలయ్య – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా వేములవాడ భీమకవి. బాలయ్య టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు ఎన్టీ రామారావు దర్శకత్వం వహించారు.

4 – దానవీరశూరకర్ణ :
ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా దానవీరశూరకర్ణ. ఈ సినిమాలో బాలయ్య అభిమన్యుడు పాత్రలో నటించి మెప్పించారు. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు కూడా ఎన్టీఆర్ కావటం విశేషం.
5- అక్బర్ సలీం అనార్కలి :
ఎన్టీఆర్ – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఐదో సినిమా అక్బర్ సలీం అనార్కలి. ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో నటిస్తే.. బాలయ్య సలీం పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యింది. అయితే డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

6 – శ్రీ మద్విరాట పర్వము :
ఎన్టీఆర్ – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఆరో సినిమా శ్రీ మద్విరాట పర్వము ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా, అర్జునుడు, దుర్యోధనుడు, కీచ‌కుడు, బృహన్నలుగా ఐదు పాత్రలో నటించారు. బాలయ్య ఈ సినిమాలో మరోసారి అభిమన్యుడు పాత్రలో నటించారు.
7- శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం :
ఎన్టీఆర్ – బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఏడో సినిమా శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ సినిమాలో ఎన్టీఆర్ వెంకటేశ్వర స్వామి పాత్రలో బాలయ్య నారదుడి పాత్రలో నటించారు.
8- రౌడీ రాముడు కొంటె కృష్ణుడు :
ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదో సినిమా రౌడీ రాముడు కొంటె కృష్ణుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం అందుకుంది.

9- అనురాగ దేవత :
ఇక వీరిద్దరి కాంబినేషన్లో తొమ్మిదో సినిమాగా వచ్చిన అనురాగ దేవత కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు
10- సింహం నవ్వింది :
అలాగే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పదో సినిమా సింహం నవ్వింది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
11- శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర :
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 11 సినిమా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గోల్డెన్ జూబ్లీ సక్సెస్ కొట్టింది.
12- బ్రహ్మర్షి విశ్వామిత్ర :
అలాగే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా 12వ సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులకు ఎందుకో నచ్చలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news