Moviesసుకుమర్ మనసు మార్చుకున్నాడా..? ఆ హీరోయిన్ ని మళ్లీ దగ్గరకు తీస్తున్నాడా..?...

సుకుమర్ మనసు మార్చుకున్నాడా..? ఆ హీరోయిన్ ని మళ్లీ దగ్గరకు తీస్తున్నాడా..? ఏం టైమింగ్ రా బాబు..!!

అవునండి.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో జోరుగా వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ..మళ్ళీ ఆ బ్యూటీ ని దగ్గరికి తీసుకుంటున్నాడా..? ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే సుకుమార్ బన్నీ కాంబోలో తెరకెక్కిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది .

మరీ ముఖ్యంగా బన్నీకి డైరెక్టర్ సుకుమార్ కి ఈ సినిమా లైఫ్ లో గుర్తుండిపోయే మెమొరబుల్ అవార్డులను తెచ్చి పెట్టింది . అంతే కాదు.. సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నా కి దశ తిరిగిపోయేలా చేసింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు బడా బాలీవుడ్ సినిమాలలో అవకాశం దక్కించుకొని ఇండస్ట్రీని షేక్ చేసేసింది . కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రష్మిక మందన పేరు ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .

ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప2 లో రష్మిక పాత్రను తగ్గించేసాడని .. సినిమా స్టార్టింగ్ లోనే రష్మిక పాత్ర చనిపోతుందని.. దీనిపై సుకుమార్ కూడా ఏ విధంగా నోరు విప్పకపోవడంతో అంత నిజమే అనుకున్నారు . అయితే రీసెంట్గా రష్మిక తన పేరుని మళ్లీ పాపులారిటీ చేసుకుంటుంది . వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ ..సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మళ్లీ తన పునర్ వైభవాన్ని అందుకుంటుంది. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో రష్మిక పై పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో ఒక్కసారి పుష్ప2 లో రష్మిక మందన పాత్రను స్క్రీన్ టైమ్ ను పెంచుతూ కథను మరో విధంగా మలుస్తున్నాడట సుక్కు. పుష్ప2లో రష్మిక పాత్ర అందరికీ దగ్గర గా డిజైన్ చేస్తున్నారట. ఈ క్రమంలోని ఇన్నాళ్లు రష్మికను వద్దు అనుకున్న సుకుమార్ ఇప్పుడు మళ్లీ అమ్మడుని కావాలి అనుకుని దగ్గర తీసుకుంటున్నాడా? ఏం మాయలోడు సుకుమార్ అంటూ రష్మిక ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news