Movies' పుష్ప 2 ' టీజ‌ర్‌… పుష్ప మ‌ర‌ణం త‌ర్వాత ఏం...

‘ పుష్ప 2 ‘ టీజ‌ర్‌… పుష్ప మ‌ర‌ణం త‌ర్వాత ఏం జ‌రిగింది.. చంపేశాడుగా ( వీడియో )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఆ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తోన్న పుష్ప 2 షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా ప్రి టీజ‌ర్ నిన్న రిలీజ్ చేశారు. రేపు బ‌న్నీ బ‌ర్త్ డే కానుక‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ ఉంటుందంటున్నారు. అయితే ఫ్యాన్స్‌కు బ‌న్నీ బ‌ర్త్ డే ట్రీట్ ఒక రోజు ముందే వ‌చ్చేసింది.

వేర్ ఈజ్ పుష్ప అంటు నిన్న 20 సెక‌న్ల వీడియో బిట్ రిలీజ్ చేసి ఆస‌క్తి రేకెత్తించారు. ఇక ఇప్పుడు ఏకంగా 3.17 నిమిషాల పాటు ఉన్న టీజ‌ర్ రిలీజ్ చేసి పెద్ద షాకే ఇచ్చారు. ఓ టీజ‌ర్ ఏకంగా మూడు నిమిషాలకు పైగా ఉండ‌డం అంటే మామూలు ట్రీట్ కాదు. ఇక టీజ‌ర్ ఆద్యంత క‌ట్టి ప‌డేసింది. కొన్ని రొటీన్ సీన్లు ఉన్నా కూడా బ‌న్నీ స్టైల్‌, చివ‌ర్లో బ‌న్నీ ఎంట్రీ… బ‌న్నీ గురించి బ్యాక్ ఎండ్‌లో చెప్పిన డైలాగ్ అయితే మోత మోగిపోవ‌డం ఖాయం.

ఇక టీజ‌ర్‌లో ముందు తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప మీద పోలీసులు పది రౌండ్ల కాల్పులు జరిపడంతో ఆయన బతికి బట్టకట్టి అవకాశం లేదని అంద‌రూ అనుకుంటూ ఉంటారు. బాక‌రావుపేట కొండమీద పుష్ప బట్టలు దొరికాయని పుష్ప బ‌తికే అవ‌కాశ‌మే లేద‌ని.. ఈ నేప‌థ్యంలో పుష్ప చ‌నిపోయాడ‌ని మీడియాలో వార్త‌ల‌తో పుష్ప వ‌ల్ల లాభ‌ప‌డిన పేద ప్ర‌జ‌లు రెడ్డెక్కి పుష్ప ఎక్క‌డ ? ఉన్నాడో ? చెప్పాల‌ని ఆందోళ‌న చేస్తూ ఉంటారు.

పుష్ప చ‌నిపోయాడని కొంద‌రు కాదు విదేశాల్లో ఉన్నాడ‌ని మ‌రికొంద‌రు చ‌ర్చించుకుంటోన్న టైంలో అనూహ్యంగా పుష్ప జాడ తెలుస్తుంది. అడవిలో పులుల కోసం ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమెరాలో పులి ముందు నుంచి పుష్ప ద‌ర్జాగా న‌డుచుకుంటూ వెళుతూ గెడ్డం ర‌ఫ్ చేస్తూ త‌గ్గేదేలే అన్న‌ట్టు స్టైల్ ఇస్తాడు. ఇది నిజంగానే టీజ‌ర్‌కే హైలెట్‌.

అస‌లు మూడు నిమిషాల టీజ‌ర్‌లో ఒక్క‌సారి కూడా బ‌న్నీని చూపించ‌రు. చివ‌ర్లో బ‌న్నీ ఎంట్రీతో టీజ‌ర్ ముగుస్తుంది. ఇది పుష్ప గాడి రూల్ అంటూ డైలాగ్ తో ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఏదేమైనా పుష్ప 2 టీజ‌ర్ అయితే ద‌ద్ద‌రిల్లిపోయేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news