Movies' ఏజెంట్ ' ప్రీమియ‌ర్ షో టాక్‌… అఖిల్ ఫ్యాన్స్‌కు క‌న్నీళ్లు,...

‘ ఏజెంట్ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… అఖిల్ ఫ్యాన్స్‌కు క‌న్నీళ్లు, ఏడుపులే త‌క్కువ‌…!

అక్కినేని హీరో అఖిల్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అఖిల్‌కు కెరీర్ పరంగా ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్ల‌ర్‌గా తరికెక్కిన ఈ సినిమా ఈరోజు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాత. అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. మలయాళ సీనియర్ హీరో ముమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. మరి అఖిల్ ఏజెంట్ సినిమాతో కెరీర్ లోనే భారీ హిట్ కొట్టాడా లేదా అన్నది చూద్దాం.

ఏజెంట్ సినిమా స్టోరీ రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమా అని తెలుస్తోంది. ఆఫీసర్ ముమ్ముట్టి ఓ మాఫియా ముఠాను పట్టుకోవడంలో విఫలమవుతాడు. అయితే వీళ్ళని పట్టుకోవడానికి కొంటె ప్రవర్తన ఉన్న అఖిల్ అయితే బెటర్ అని.. అలాంటివాడే ఇలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ను కొట్టుకుంటాడని ఈఆపరేషన్ ఏజెంట్ అఖిల్‌కు అప్పగిస్తారు. దీంతో అఖిల్ తన కొంటితనంతో.. అల్లరితో వారిని ఎలా పట్టుకున్నాడు అన్నదే ఈ సినిమా కథాంశం.

ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన ప్రకారం ఏజెంట్ సినిమాకు చాలావరకు నెగిటివ్ టాక్ వస్తుంది. అఖిల్ కి కెరీర్లో మరి మరో భారీ డిజాస్టర్ తప్పదని.. ఏజెంట్ ఆపరేషన్ మిస్ ఫైర్ అయ్యింద‌ని అంటున్నారు. సినిమాలో యాక్షన్, ప్రొడక్షన్ తప్ప ఇంకేం బాగోలేదని అంటున్నారు. అఖిల్‌ వరకు యాక్షన్ పరంగా మెప్పించాడని.. అయితే నటనతో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ అఫ్ వరకు కొంత పర్వాలేదట.

అయితే సెకండ్ హాఫ్ దారుణంగా ఉందట. స్టోరీ చాలా చెత్తగా ఉందని.. కథనం చాలా స్లోగా సాగుతుందని… ఇక వీఎఫ్ఎక్స్‌ ఎలాంటి క్వాలిటీ లేదని.. క్లైమాక్స్ కూడా సిల్లీగా ఉందని చెబుతున్నారు. మరికొందరు అయితే ఫస్టాఫ్ కూడా యావరేజ్ గానే ఉందని.. అసలు కథ పరమ రొటీన్ అని ఇంటర్వెల్‌కి ముందు వార్నింగ్ ఇచ్చే సీన్ తప్ప ఫస్టాఫ్ లో కూడా ఏం లేదని చెబుతున్నారు. ఇక సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం ఏమాత్రం ఆకట్టుకునేలా లేవట.

హీరోయిన్ లిప్స్ కూడా మ్యాచ్ కాలేదని.. ఆమె పాత్రకు సంబంధించిన సీన్లు చాలా బోరింగ్ గా ఉన్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు సెకండ్ హాఫ్ లో బలమైన కథ‌లేదని.. ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని.. కామెడీ సీన్లు కూడా వర్కౌట్ కాలేదని చెబుతున్నారు. అసలు సెకండ్ హాఫ్ పరమ బోరింగ్ గా ఉందని.. కథలో ఏమాత్రం దమ్ము లేదని క్లైమాక్స్ కూడా ఘోరంగా ఉందని చెబుతున్నారు.

కేవలం టెర్రిఫిక్ యాక్షన్, ఫైట్లు మినహా సినిమాలో కథ‌ కథనాలు లేవని.. ముమ్ముట్టి నటన మాత్రం ఆకట్టుకుందని అఖిల్ నటుడుగా ఇంకా చాలా ఎదగాలని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని అఖిల కోరిక తీరని కోల‌గానే మిగిలిపోతుందని చెబుతున్నారు. ఓవ‌రాల్‌గా ఏజెంట్ సినిమాకు యూఎస్ ప్రీమియర్ల నుంచి భారీ నెగిటివ్ టాక్ అయితే వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news