Moviesఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో జక్కన్న లాస్ట్ లో ఎందుకు కుర్చున్నాడో...

ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో జక్కన్న లాస్ట్ లో ఎందుకు కుర్చున్నాడో తెలుసా..? ఇంత పిసినారి ఏంట్రా బాబు..!!

కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది . మన ఇండియన్ సినిమాకి ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు వరించింది . ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. ఫస్ట్ టైం మన ఇండియన్స్ ఆస్కార్ స్టేజిపై అవార్డు అందుకుని ప్రసంగించారు . ఇప్పటికీ ఆ వేడి అనేది తగ్గలేదు. సోషల్ మీడియాలో ఇప్పటికి ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్స్ కి సంబంధించిన పిక్స్ విజువల్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి .

కాగా రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డులో భాగంగా ఎందుకు జక్కన్న వెనక సీట్ లోనే కూర్చొని ఉండిపోయారు అన్న న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సినిమాకు కర్త – కర్మ – క్రియ అన్ని తానై నడిపించిన జక్కన్న ఎందుకు ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో మాత్రం హంగామా చేయలేదు. లాస్ట్ లో కూర్చుండిపోయారు అన్న న్యూస్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆస్కార్ అవార్డు అందుకున్న వారు పక్కన మరొకరు మాత్రమే స్టేజి ఎక్కాల్సి ఉంటుంది .

అంతేకాదు స్పీచ్ కూడా 45 సెకండ్లపై ఉండకూడదు అది ఆస్కార్ అకాడమీ నిబంధన. కాగా ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో రాజమౌళి ఎందుకు వెనక కూర్చున్నాడు అన్నదానికి ఆన్సర్ దొరికేసింది. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో మొదటి వరుసలో కూర్చోవాలంటే ఒక్కొక్కరు 750 డాలర్లు చెల్లించి మరి సీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది . చివరి వరుసలో ఉండేది కేవలం 150 డాలర్లు మాత్రమే .. ఆ మేరకు టీం మొత్తం వెనుక వరుసలో కూర్చున్నారు అని ..రాజమౌళి ఇక్కడ ఇంత పిసినారితనంగా ప్రవర్తించారు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతేకాదు దీనికోసం సుమారు రాజమౌళి ఒక్కొక్క మనిషికి 12,750 ఖర్చు చేశారట . ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డు అందుకోవడం ముఖ్యం.. వెనక ముందు కూర్చున్నామా అన్నది కాదు అన్నది రాజమౌళి మెయిన్ ధీరి అని జక్కన్న అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ముందున్నా వెనకున్న సినిమాకు మాత్రం ఆస్కార్ అవార్డు రానిచ్చారు.. అది హ్యాపీ అంటూ జనాలు మరోసారి ఆయన పేరుని అప్రిషియేట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news