Moviesఆ తెలుగు డైరెక్టర్ నాని ని అంత దారుణంగా అవమానించారా..?.. పేరుతో...

ఆ తెలుగు డైరెక్టర్ నాని ని అంత దారుణంగా అవమానించారా..?.. పేరుతో సహ బయటపెట్టేసాడుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని .. ప్రెసెంట్ శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్లో దసరా అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా మార్చి 30న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తన గత తాలుకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు . ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఆయన ను పేరు ప్రఖ్యాతలు ఉన్న ఓ డైరెక్టర్ ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు ..ఎలాంటి అవమానాలను తాను ఎదురుకున్నాను అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు .

దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని .. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాలేదని ..ఎవరు సహాయం చేసేవారు లేరు.. హెల్ప్ అడిగిన చీదరించుకుంటూ కోప్పడే వారిని.. అలాంటి టైంలోనే చాలా అవమానాలను ఎదుర్కొనని చెప్పుకొచ్చాడు “.

“అంతేకాదు స్టార్ తెలుగు డైరెక్టర్ షూటింగ్ లొకేషన్లో అందరూ చూస్తుండగానే.. నువ్వు నీ జీవితం లో స్టార్ వి కాలేవు అంటూ తనని ఘోరంగా అవమానించారని కూడా చెప్పుకొచ్చాడు “. నాని తనకు జరిగిన అవమానాల గురించి బయటపెట్టడంతో నాని ఫ్యాన్స్ సదరు డైరెక్టర్ ఇతనే అంటూ పేరుతో సహా ట్రోల్ చేస్తున్నారు. మొదటి నుంచి నానికి ఆయన అంటే పడదని.. ఆయనకి నోటి దూకుడు ఎక్కువే అని.. అందుకే ఆయనే అనుకుంటున్నారు ఫ్యాన్స్. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ పేరుతో సహా బయటపెట్టి మరి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు ఫ్యాన్స్. నాని కెరియర్ పైకి ఎదగనీకుండా చేసింది కూడా ఆయనే అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఇష్యూ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

Latest news