Moviesత్రివిక్ర‌మ్ ఆ ప‌ని చేశాడంటే మ‌హేష్ సినిమా అట్ట‌ర్ ప్లాపే..!

త్రివిక్ర‌మ్ ఆ ప‌ని చేశాడంటే మ‌హేష్ సినిమా అట్ట‌ర్ ప్లాపే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే మంచి క్రేజ్ ఉంటుంది. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా మంచి సినిమాలుగా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి. అతడు సినిమా 2005లో వచ్చింది అప్పటికి త్రివిక్రమ్ అంత స్టార్ డైరెక్టర్ కాదు. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో కమర్షియల్ గా లాభాలు తెచ్చి పెట్టలేదు.

ఇక భారీ అంచనాలతో వచ్చిన ఖలేజా సినిమా 2017లో రిలీజ్ అయింది. అంతకు ముందు మహేష్ బాబు మూడున్నర సంవత్సరాలు లాంగ్ గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఖలేజా. ఖలేజా సినిమాను అర్థం చేసుకునే విషయంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కావడంతో ఖలేజా కూడా సక్సెస్ కాలేదు. ఇక 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో మళ్ళీ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తే ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. అక్టోబర్లో రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి. మహేష్ బాబు నటించిన బాబీ సినిమా 2002 అక్టోబర్ 31న రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది. మహేష్ బాబు కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్ల‌లో ఒకటిగా బాబి నిలిచింది. ఇక మహేష్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన అతిధి మూవీ 2007 అక్టోబర్ 18న రిలీజ్ అయ్యి నిరాశపరిచింది.

అలాగే ఇదే నెలలో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా కూడా అక్టోబర్ 7 , 2017న రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాను సెప్టెంబర్ లో మాత్రం రిలీజ్ చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయాలని ప్లానింగ్ జరుగుతుంది.

మ‌రి మహేష్ సినిమాల‌కు ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమాను సెప్టెంబర్ నెల నుంచి తప్పిస్తారా ? లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే డిజిటల్ హక్కులు కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news