Moviesఅక్కినేని ఫ్యామిలీలో ఒకేసారి మూడు పెళ్లిళ్లు… ఆ 3 జంట‌లు… షాకింగ్...

అక్కినేని ఫ్యామిలీలో ఒకేసారి మూడు పెళ్లిళ్లు… ఆ 3 జంట‌లు… షాకింగ్ ట్విస్టులు ఇవే..!

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఆరేడు దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలకు వరుసగా అభిమానులు కంటిన్యూగా వస్తూ ఉండటం నిజంగా గొప్ప విషయం. దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీకి ఉన్న రెండు కళ్ళలో ఎన్టీఆర్ తర్వాత ఏఎన్నార్ రెండో కన్నుగా చెబుతారు.

ఆ తర్వాత ఆయన నట వారసుడుగా ఆయన కుమారుడు నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ లో కొనసాగుతూనే వస్తున్నారు. ఇక ఇదే కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కినేని కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతున్నారు. అయితే ఏఎన్ఆర్, నాగార్జున అంతా స్టార్ హీరోలు కాకపోయినా తమకు ఎలాంటి కథలు అయితే సూట్ అవుతాయో ? అదే తరహా కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వెళుతున్నారు.

బాధాకరం ఏంటంటే అక్కినేని కుటుంబంలో ఎప్పుడు వైవాహిక సంబంధాలు కలిసి రావటం లేదు. నాగర్జున తొలి వివాహం విచ్ఛిన్నమైంది. ఇటు ఆయన తనయుడు నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంతను చేసుకుంటే ఆ ఆనందం కూడా నాలుగేళ్లకే ముగిసిపోయింది. ఇక నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఎంగేజ్మెంట్ తోనే బ్రేకప్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సినిమా రంగంలో కొనసాగుతున్న నాగర్జున మేనకోడలు సుప్రియ, మేనల్లుడు సుమంత్ వైవాహిక బంధాలు కూడా విచ్ఛిన్నం అయ్యాయి.

ఇదిలా ఉంటే నాగార్జున త్వరలోనే తన ఇద్దరు కుమారులకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నాడు. అఖిల్ కు ఈసారి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన యువతితో పెళ్లి జరిపే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పెద్ద కుమారుడు నాగచైతన్యకు తనకు నచ్చిన అమ్మాయి తోనే పెళ్లి చేయాలని నాగార్జున డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. చైతు మనసులో ఉన్న అమ్మాయి ఎవరు ? అన్నది అంతు పట్టటం లేదు. ఒక హీరోయిన్ తో చైతు ప్రేమలో ఉన్నాడు అని పుకార్లు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి కూడా తిరుగుతున్నారు. అయితే చైతు రెండో భార్యగా ఆ హీరోయిన్ వస్తుందా లేదా ఈసారి ఎవరి మెడలో ? మూడు ముళ్ళు వేస్తాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

అలాగే నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. సుప్రియ తనకంటే వయసులో చిన్నోడు అయిన‌ అడవి శేషుతో ప్రేమలో ఉందని పుకారు వస్తున్నాయి. బహుశా సుప్రియ అడవి శేష్‌ పెళ్లి చేసుకోవచ్చని అంటున్నారు. ఏదేమైనా కొద్ది నెలల గ్యాప్ లోనే అక్కినేని ఫ్యామిలీలో మూడు పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news