MoviesSamantha "నువ్వులేకపోతే నేను లేను..నీపై ఇష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను".. ఈగో వదిలి...

Samantha “నువ్వులేకపోతే నేను లేను..నీపై ఇష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను”.. ఈగో వదిలి ప్రేమను బయటపెట్టిన సమంత..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సమంత ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సమంత క్రేజ్ ..సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో తెలియదు కానీ …డివర్స్ తీసుకున్న తరువాత మాత్రం సోషల్ మీడియాలో సమంత జోరు రోజురోజుకి పెరిగిపోతుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే విడాకులు ఇచ్చేసింది.

ప్రజెంట్ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత ..నాగచైతన్య తమ లైఫ్ లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సైన్ చేస్తూ సమంత స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అలాగే కొనసాగిస్తుంది . అయితే ఇండస్ట్రీలో కనీసం హీరోగా అయినా సరే సెటిల్ అవుదామంటూ చైతన్య తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా ద్వారా తాను ప్రేమించే వ్యక్తి గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే సమంతకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి అంటే ఎంత ఇష్టమో .. ఆమె డైరెక్షన్లో ఓ బేబీ సినిమా చేసింది . అంతేకాదు నాగచైతన్య – సమంత కాంబోలో మరో సినిమాకి అగ్రిమెంట్ పై సైన్ కూడా చేయించుకుంది . ఈలోపే డివర్స్ తీసుకునేసారు ఈ జంట . ఆ అగ్రిమెంట్ ని గాల్లో కలిపేశారు . ఈ క్రమంలోనే నందిని రెడ్డికి సమంతకి మధ్య గ్యాప్ వచ్చిందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే రీసెంట్గా సమంత అవి అంత ఫేక్ అంటూ కొట్టి పడేస్తూ.. నందిని రెడ్డి బర్త్ డే సందర్భంగా సెన్ సేషనల్ పోస్ట్ పెట్టింది. లైఫ్ లో ప్రతి ఒక్కరికి నీలాంటి ఫ్రెండ్ కావాలి .. కష్ట సమయాలలో ఆదుకోవడానికి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పడానికి .. ప్రతి ఒక్కరికి నీలాంటి ఓ మంచి స్నేహితురాలు ఉండాలి ..నువ్వు లేకుండా నేను లేను ..నా లైఫ్ లో నువ్వు ఎంతో ఇంపార్టెంట్.. నీ పై ప్రేమను మాటల్లో చెప్పలేకపోతున్నాను ” అంటూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోని సమంతకు నందిని రెడ్డి అంటే అంత ఇష్టమా..? ఇన్నాళ్లు ఈగో అనుకున్న సమంత..మనసులో ఇంత ప్రేమ దాగుందా..? అంటూ కమెంట్స్ చేస్తున్నారు..!!
అంతేకాదు త్వరలోనే నందిని డైరెక్షన్లో సమంత మరో సినిమా చేయబోతుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news