Movies"చరణ్ ఓ పొట్టోడు" అని..గోల్డెన్ లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ...

“చరణ్ ఓ పొట్టోడు” అని..గోల్డెన్ లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే..గుండె ముక్కలైపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పలువురు బడా స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ బ్యూటీస్ హాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే గతంలో స్టార్ హీరోయిన్ చరణ్ ని పొట్టోడా అంటూ ఆయనతో నటించను అంటూ సినిమా రిజెక్ట్ చేసిన న్యూస్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు సెట్ చేయడానికి డైరెక్టర్స్ నాన్న తంటాలు పడుతూ ఉంటారు . రాజమౌళి క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడానికి చాలా కష్టపడ్డారట . అయితే ఆ హీరోయిన్ మాత్రం నో చెప్పడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మగధీర సినిమా ప్రాజెక్ట్ అనుకున్న విధంగా.. అనుకున్న హీరోయిన్ తో తెరకెక్కించలేకపోయాడట.

ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి.. మగధీర ఆఫర్ ని రిజెక్ట్ చేసింది . చరణ్ హీరో గా నటించిన మగధీర సినిమాలో కాజల్ కన్నా ముందు అనుష్క శెట్టి హీరోయిన్గా అనుకున్నారని.. అయితే చరణ్ తనకంటే పొట్టిగా ఉండడంతో అమ్మడు ఈ కాంబో సెట్ అవ్వదు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చిందట.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవికి సైతం అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిందట . హైట్ లో నాకన్నా చరణ్ చాలా చిన్నగా ఉంటాడు. తెర పై మా పెయిర్ వర్క్ అవుట్ అవ్వదు అంటూ ఓపెన్ గా చెప్పడంతో చిరంజీవి సైతం షాక్ అయ్యారట . ఈ విధంగానే బంగారం లాంటి మగధీర ఛాన్స్ ని మిస్ చేసుకుంది అనుష్క అంటూ జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు ఆ సినిమా అనుష్క చేసుంటే ఆ తర్వాత కాజల్ స్థానంలో అనుష్క అన్ని ఆఫర్లు అందుకునేది అంటూ అనుష్క ఫ్యాన్స్ అయితే బాధ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news