Moviesపూజా హెగ్డే పై రివేంజ్ తీర్చుకుంటున్న స్టార్ హీరో.. ఒక్క దెబ్బకు...

పూజా హెగ్డే పై రివేంజ్ తీర్చుకుంటున్న స్టార్ హీరో.. ఒక్క దెబ్బకు బిడ్డకు వాచిపోయిందే..!!

అయ్యయ్యో.. పూజ హెగ్డే టైం మరి ఇంత బ్యాడ్ గా నడుస్తుందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో పూజ హెగ్డే పేరు చెప్తే ఓ రేంజ్ లో పూజలు చేసే వాళ్ళు జనాలు ..ఇప్పుడు అమ్మడు పేరు చెప్తే పూజలు కాదు కదా కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆమె పేరుని మర్చిపోయారు జనాలు . దానికి మెయిన్ రీజన్ ఆమె లాస్ట్ గా నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడమే.

ఎస్ పూజా హెగ్డే ఎన్నో భారీ అంచనాల మధ్య నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ తుస్సు మన్నాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో డైరెక్టర్ లు సైతం అవకాశాలు ఇవ్వడం మానేశారు. కాగా గతంలో అమ్మడు తన హెడ్ వెయిట్ కారణంగా స్టార్ హీరోతో గొడవ వేసుకుంది అన్న న్యూస్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. అయినా సరే పూజ హెగ్డే కి పర్లేదు అనే పేరు వినిపించింది.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు ప్రవర్తించిన తీరు ఇప్పటికి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సదరు హీరోతో ఫొటోస్ దిగనని చెప్పడం.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో కూడా హీరో పేరు ప్రస్తావించకుండా మిగతా అందరి పేర్లు పలకడం.. అప్పట్లో సంచలనంగా మారింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పూజా హెగ్డే తో ఆ హీరో సినిమా చేయడానికి రెడీగా లేడు . అంతేకాదు ఆయన నెక్స్ట్ సినిమాలో డైరెక్టర్ పూజ హెగ్డే పేరు చెప్తే ఆ హీరో వద్దు ఆమె ప్లేస్ లోకి పాపులారిటీ లేని హీరోయిన్ అయినా తీసుకోరండి కానీ పూజా హెగ్డే తో క ఇక స్క్రీన్ షేర్ చేసుకునేది ఉండదు అంటూ తేల్చి చెప్పేసాడట .

ఈ క్రమంలోనే పూజ హెగ్డే ఖాతా నుంచి మంచి అవకాశం పోయింది . పూజ హెగ్డే కి ఈ అవకాశం వచ్చుంటే కచ్చితంగా కాస్త కూస్తో పాజిటివ్ టాక్ దక్కించుకునేది . ఇలా అమ్మడు ఒకప్పుడు చేసిన హెడ్ వెయిట్ బిహేవియర్ కారణంగా ఇప్పుడు కష్టాలు పాలవుతుంది. అంతేకాదు ఆ స్టార్ హీరో కూడా టైం చూసి పూజా హెగ్డే పై పగ తీర్చుకుంటున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ దెబ్బకి పూజ హెగ్డే కెరియర్ ఖతం అని చెప్పక తప్పదు అంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news