Moviesఅక్కినేని ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. పండగరోజు చైతన్య కొత్త ఇంట్లో...

అక్కినేని ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్.. పండగరోజు చైతన్య కొత్త ఇంట్లో స్పెషల్ గెస్ట్..ఈ షాక్ మాములూగా లేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య.. ప్రెసెంట్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా కస్టడి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఫస్ట్ టైం యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఫుల్ లెంత్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు నాగచైతన్య . దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. కాగా ఈ మధ్యకాలంలో నాగచైతన్య తన పర్సనల్ విషయాలు కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉన్నాడు .

అంతే కాదు సమంత తో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. కాగా గత నాలుగు రోజుల నుంచి నాగచైతన్య కొత్త ఇంటిని కొనుక్కున్నాడు అని .. ఇంటికి దూరంగా ఉండబోతున్నాడని.. కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఉగాది పండుగ కానుకగా నాగచైతన్య ఇంటికి కొత్తగా వెళ్లిన స్పెషల్ గెస్ట్ సర్ ప్రైజ్ చేసాడు.

ఎస్ ఉగాది సందర్భంగా నాగచైతన్య ఇంటికి ఫస్ట్ గెస్ట్ వెళ్లారు . ఈ క్రమంలోని ఎవరు ఊహించిన విధంగా ఆయన అక్కడ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు . ఇంతకీ నాగచైతన్య ఇంటికి ఫస్ట్ గెస్ట్ గా వెళ్ళింది ఎవరో తెలుసా.. అతను ఎవరో కాదు రీసెంట్గా పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న చందు మొండేటి. ముండేటికి నాగచైతన్య కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. వీళ్లిద్దరి కాంబినేషన్ సవ్యసాచి అనే సినిమా కూడా వచ్చింది.

అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మారిన చై, చెందు మాత్రం మంచి ఫ్రెండ్స్ గా మిగిలిపోయారు. ఈ క్రమంలోనే చందు ని నాగచైతన్య ఫస్ట్ గెస్ట్ గా ఇంటికి ఆహ్వానించాడట . “ఉగాది రోజు యువసామ్రాట్ కొత్త ఇంట్లో నేనే మొదటి గెస్ట్.. నాగచైతన్య కి కంగ్రాట్స్ ” అంటూ చెప్పాడు చందు . ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news