Moviesబికినీలో సీనియ‌ర్ న‌టి రాధ… ఈ ఫొటో వెన‌క ఇంత స్టోరీ...

బికినీలో సీనియ‌ర్ న‌టి రాధ… ఈ ఫొటో వెన‌క ఇంత స్టోరీ ఉందా…!

1989వ దశలో వెండితెరపై ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ రాధ మలయాళీ అమ్మాయి.. అయినా రాధ‌ సౌత్ ఇండియన్ లో అన్ని భాషల్లోనూ హీరోయిన్గా నటించింది. అప్పట్లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ జోడి కట్టింది. అప్పటి తరం సినీ అభిమానులకు రాధ పేరు పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో రాధ పేరుతోనే ఆమె పాపులారిటీ సాధించింది. అయితే ఆమె అసలు పేరు ఉదయ చంద్రిక.

దక్షిణాదిలో అన్ని భాషలలోనూ కలిపి 250 కు పైగా సినిమాలలో నటించింది. సినిమాలకు గుడ్ బై చెప్పిన రాధ‌ ముంబైకు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో చక్కగా సెటిల్ అయింది. రాధకు ఇద్దరు కుమార్తెలు కార్తీక, తులసి. ఇద్దరు కూడా తెలుగులోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.
అయితే కార్తీక, తులసి ఇద్దరు హీరోయిన్లుగా సక్సెస్ కాలేదు. వీరిద్దరిని హీరోయిన్లుగా నిలబెట్టినందుకు రాధచేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.

తాజాగా రాధ‌ ఆమె గ‌తంలో నటించిన ఓ సినిమాలోని ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ ఫోటోలో ఆమె బికినీ వేసుకొని ఉంది. అప్పట్లో రాధ అంటే కాస్త హాట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అందాలు ఆరబోసే విషయంలో కాస్త డేరింగ్ గానే కనిపించేది. ఇక తాజాగా రాధ బికినీ వేసిన ఫోటో కమలహాసన్ నటించిన సినిమాలోది. చాలా రోజుల తర్వాత ఆ ఫోటో షేర్ చేయడంతో.. ఇప్పుడు అది సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా వైరల్ అవుతుంది. రాధా కమలహాసన్‌తో నటించిన టిక్ టిక్ టిక్ సినిమాలో బికినీ వేసింది.

తాను అప్పట్లో చాలా డేర్ స్టెప్ వేసి బికినీ వేశానని.. కానీ కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మేము అలా కనిపించటానికి చేసిన పోరాటాన్ని మెచ్చుకోవాలని… రాధా ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటోలో స్టాండింగ్ లుక్ తో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు… కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని రాధా రాసుకుంది. అలాగే ఇలాంటి అందమైన దుస్తులను డిజైన్ చేసిన డిజైనర్ వాణి గణపతికి మా కృతజ్ఞతలు అంటూ రాధా పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలో కమలహాసన్ కుర్చీలో చాలా స్టైల్‌గా కూర్చుని ఉన్నాడు. ఆ వెనక రాధా, స్వప్న, మాధవి నిలబడి హాట్ హాట్ అందాలతో కనుల‌ విందు చేస్తున్నారు. 1981లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ ముగ్గురు ముద్దుగుమ్మల దుస్తులను డిజైన్ చేసిన వాణి గణపతి ఎవరో ? కాదు కమల్ హాసన్ కు మొదటి భార్య కావడం విశేషం. ఈ బికినీ స్టిల్స్ చూస్తుంటే 40 ఏళ్ల క్రితమే రాధ లాంటి స్టార్ హీరోయిన్ చేసిన డేరింగ్ మెచ్చుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news