Moviesఇంద్ర భవనం లాంటి ఇల్లు..కోట్లకు పడగలెత్తిన కమెడియన్ రఘు.. తెర వెనుక...

ఇంద్ర భవనం లాంటి ఇల్లు..కోట్లకు పడగలెత్తిన కమెడియన్ రఘు.. తెర వెనుక అలాంటి పనులు చేస్తున్నాడా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీస్ కి సంబంధించిన లగ్జరీ లైఫ్ స్టైల్ వైరల్ అయిపోతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీసే కాదు బుల్లితెరపై మెరిసే కమెడియన్స్ కూడా కోట్లకు కోట్లు పోసి ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ పుణ్యామా అని రఘు కారుమంచి లైఫ్ స్టైల్ బయటపడింది . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఆది సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రఘు ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించాడు . మరీ ముఖ్యంగా ఆది సినిమాలో ఆయన చెప్పిన ఫెయిర్ అండ్ లవ్లీ డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది . ఆది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఎన్టీఆర్ తో పాటు రఘు పేరు కూడా వెలుగులోకి వచ్చింది .

ఆ తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఆయన్ను ప్రోత్సహించారు . ఈ క్రమంలోనే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు . కాగా కెరియర్ పీక్స్ గా ఉండగానే వెండితెరను వదిలి బుల్లితెరపై ప్రత్యక్షమైన రఘు..జబర్దస్త్ కమెడియన్ గా అవతారం ఎత్తాడు. 2013లో ఈటీవీ ప్రయోగాత్మకంగా కండక్ట్ చేసిన కామెడీ షో లో రోలర్ రఘు అనే పేరుతో రఘు కారుమంచి ఎంట్రీ ఇచ్చాడు . ఆ తర్వాత తనదైన స్టైల్ లో స్కిట్స్ చేస్తూ యాంకర్ అనసూయ ను ఓ రేంజ్ లో రఘు ఏడిపించారు . ఈ క్రమంలోని ఆయన వేసే పంచెస్ పై అనసూయ హార్ట్ అయిందని ఆ కరణంగానే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ రఘు కారుమంచిని జబర్దస్త్ నుండి తీసేసారని వార్తలు వినిపించాయి. అప్పట్లో ఆయన ఆర్థికంగా బాగా దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

వందలాది చిత్రాలల్లో నటించిన రఘు స్టార్ కమెడియన్ కాకపోవడానికి ఆయనకున్న వ్యసనాల కారణమంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . కగా రీసెంట్గా రఘు కారుమంచి మీడియా కంట పడ్డారు. ఓ యూట్యూబ్ ఛానల్ పుణ్యమాంటూ ఆయన హోమ్ టూర్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. విశాలమైన లగ్జరీ హౌస్ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది . అంతేకాదు ఖరీదైన ఏరియాలో ఉన్నతమైన కమ్యూనిటీ మధ్య రఘు ఇల్లు ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అద్భుతమైన ఇంటీరియర్ డిజైనర్ తో స్టార్స్ కూడా కట్టుకోలేని విధంగా రఘు ఇల్లు కట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ర్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు ఆయన తీసుకునే ఆహారం మొత్తం ఆర్గానిక్ పద్ధతిలోనే స్వయంగా పండించుకొని తింటారని రఘు చెప్పుకు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది . కోట్ల రూపాయలు విలువచేసే ఆ ఇంటిని చూశాక రఘు ఈ రేంజ్ లో ఎప్పుడు సంపాదించారా అంటూ జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదుతున్న సమాచారం ప్రకారం రఘు కి తెలంగాణలో రెండు వైన్ షాపులు ఉన్నాయట. ఆ ద్వారా వచ్చిన డబ్బే ఇలా కోట్లకు పడగలెత్తాడట . ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతోనే ఇవంత కట్టుకున్నాడు అంటూ సినీ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది ..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news