Moviesఘట్టమనేని ఇంటికి కొత్త కోడలు వచ్చేసిందోచ్.. సైలెంట్ షాకిచ్చిన నరేష్..(వీడియో)..!!

ఘట్టమనేని ఇంటికి కొత్త కోడలు వచ్చేసిందోచ్.. సైలెంట్ షాకిచ్చిన నరేష్..(వీడియో)..!!

ఫైనల్లీ.. నరేష్ అనుకున్నది సాధించాడు . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సినిమా ..ఇండస్ట్రీలో నరేష్ – పవిత్ర లోకేష్ మ్యాటర్ ఎలా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. కాగా ఆ వ్యవహారాన్ని అఫీషియల్ చేస్తూ మూడుముళ్ల బంధంతో ఒక్కటైపోయారుఈ జంట. కొన్ని నిమిషాల క్రితమే నరేష్ -పవిత్ర మెడలో మూడు ముళ్ళు కడుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు .

ప్రముఖ తెలుగు యాక్టర్ నరేష్ ..తోటి నటి పవిత్ర వివాహ బంధంతో ఒకటయ్యారు . గత కొంతకాలంగా వీళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్ళి కాకుండానే పబ్లిక్ గానే చట్టా పట్టాలు వేసుకొని తిరగడం కూడా వివాదాస్పదంగా మారింది . ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ..ముగ్గురికి సక్సెస్ఫుల్గా విడాకులు ఇచ్చి ..నాలుగో భార్యగా పవిత్ర ను తన లైఫ్ లోకి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన అఫీషియల్ వీడియోని రిలీజ్ చేసాడు.

పెళ్ళిగా అఫీషియల్ వీడియో రిలీజ్ చేస్తూ ..”ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం” ఇట్లు పవిత్ర నరేష్ “అంటూ ఎమోషనల్ గా మెసేజ్ ను షేర్ చేశారు . ఈ క్రమంలోనే ఇకపై పవిత్ర లోకేష్… పవిత్ర నరేష్ గా అఫీషియల్గా తన స్థానాన్ని సంపాదించుకుంది . ఈ క్రమంలోని కొత్త జంటకు పలువురు విషెస్ చెబుతున్నారు . మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో పవిత్ర నరేష్ మ్యాటర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FItsActorNaresh%2Fstatus%2F1634070240366850049&widget=Tweet
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news