MoviesPooja Hedge పూజాకి కొంచెం కొంచెం జారుతుందా..? ఇక అది ఒక్కటే...

Pooja Hedge పూజాకి కొంచెం కొంచెం జారుతుందా..? ఇక అది ఒక్కటే మిగిలిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి హిట్ కొట్టడానికి నానాదంటాలు పడింది . అంతేనా హిట్ కొట్టిన తర్వాత కూడా ఆఫర్ల కోసం డైరెక్టర్లను ముప్పు తిప్పలు పెట్టింది . అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథంతో మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ..ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద రాఘవ వీర సమేత సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఈ క్రమంలోనే అప్పటినుంచి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పూజ హెగ్డే .. రీసెంట్గా వరుస డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకుంది . రామ్ చరణ్ తో ఆచార్య.. విజయ్ తో బీస్ట్.. ప్రభాస్ తో రాధేశ్యామ్.. ఇలా వరుసగా అన్ని డిజాస్టర్లు తన ఖాతాలో వేసుకుంది . ఈ క్రమంలోని పూజా హెగ్డే టైం బాగోలేదు అని ..అందుకే మరోసారి ఐరెన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంటుందని జనాలు చెప్పుకొస్తున్నారు.

అంతే కాదు ప్రెసెంట్ పూజా హెగ్డే చేతిలో ఉన్న ఆఫర్స్ ఒక్కొక్కటిగా జారిపోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన ఉస్దాత్ భగత్ సింగ్ సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకున్ని బిగ్గెస్ట్ తప్పు చేసింది. అంతేకాదు ఎస్ ఎస్ ఎం బి సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యి..సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకవేళ ఇదే గనుక కొనసాగితే పూజా హెగ్డే ఒకప్పటి హీరోయిన్ అని చెప్పుకోవడానికి చరిత్రలో మిగిలిపోతుందని జనాలు భావిస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి ఆఫర్స్ పూజా హెగ్డే చేతి నుండి చేజారిపోవడం ఆమెకు మైనస్ మారింది . చూద్దాం..ఈ దెబ్బలను ఎలా తిప్పి కొడుతుందో పూజా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news