Moviesకాళ్లు పైకి ఎత్తి..చెప్పు చేతికి తీసుకున్న కృతిశెట్టి.. అసలు ఏమైందంటే..?

కాళ్లు పైకి ఎత్తి..చెప్పు చేతికి తీసుకున్న కృతిశెట్టి.. అసలు ఏమైందంటే..?

అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేసిన ఉప్పెన సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ మొదటి మూడు సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అందుకున్నాయో.. ఆ తర్వాత మూడు సినిమాలు అదే రేంజ్ లో డిజాస్టర్ అందుకుంది .

ఈ క్రమంలోనే అమ్మడు తర్వాత నటిస్తున్న సినిమా చాలా కీలకంగా మారింది . నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్గా నటించింది కృతి శెట్టి. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా హిట్ అయితే కృతికి పునర్ వైభవం అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి . ఒకవేళ ఫ్లాప్ అయిందంటే మాత్రం కృయిశెట్టి కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అని చెప్పొచ్చు .

కాగా ఇలాంటి క్రమంలోనే కృతిశెట్టి తన పేరును జనాలు మర్చిపోకుండా ఉండాలని హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. ఇప్పటివరకు చుడిదార్.. చీరలలో.. జీన్స్ లో కనిపించిన కృతి శెట్టి ఇప్పుడు ఏకంగా మిని స్కట్ లో కనిపించింది . చిట్టి పొట్టి గౌన్ వేసుకుని కాళ్ళను పైకెత్తుతూ షూస్ ను చేతిలో పట్టుకుని ఇచ్చిన స్టిల్ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు . అంతేకాదు కచ్చితంగా కుర్రాళ్ళు ఆమెను గుండెల్లో పెట్టి చూసుకుంటారు అంటున్నారు నెటిజన్స్ . చూడాలి మరి కృతి శెట్టి ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news