Moviesకీర్తి సురేష్ మొత్తం ఆస్తుల లెక్క‌లు చూస్తే క‌ళ్లు జిగేల్‌.. ఇన్ని...

కీర్తి సురేష్ మొత్తం ఆస్తుల లెక్క‌లు చూస్తే క‌ళ్లు జిగేల్‌.. ఇన్ని కోట్లు వెన‌కేసుకుందా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే మంచి పేరు ప్రతిష్టల‌తో పాటు స్టార్ హీరోయిన్ అయింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ ది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తల్లి మేనక చిరంజీవితో పునాదిరాళ్ళు లాంటి సినిమాలో నటించింది. ఇక రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి మహానటి సినిమాతో ఆమెను తరతరాలు కూడా గుర్తుపెట్టుకునేలా ఎంతో కీర్తి తెచ్చుకుంది.

గత ఏడాది మహేష్ బాబు జోడిగా సర్కారీ వారి పాట సినిమాలో రొమాన్స్ చేసిన కీర్తి ప్రస్తుతం నాని స‌ర‌సన దసరా సినిమాలో నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నేను లోకల్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టిన కీర్తి ఆస్తులు కూడా బాగానే కూడపెట్టుకుంది. కీర్తి సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ 35 నుంచి రూ 40 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.

ఆమె ఒక్కో సినిమాకు ప్రారంభంలో 40 లక్షల నుంచి 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది. స్టార్ హీరోయిన్ అయ్యాక ఒక్కో సినిమాకు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు వసూలు చేసింది. దసరా సినిమాకు కూడా ఆమె మూడు కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. అలాగే కీర్తి కొన్ని ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరిస్తోంది. రిలయన్స్ ట్రెండ్స్, ఉషా ఇంటర్నేషనల్, జోస్ అలుకాస్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

ఇందులో ఒక్కో ఎండార్స్మెంట్‌కు కీర్తి రూ 15 నుంచి రూ 30 లక్షలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కీర్తికి తిరుపనంతపురం తో పాటు చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. అలాగే హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో పోస్ట్ ఏరియాలో ఒక కాస్ట్‌లీ ఇల్లు ఉంది. అలాగే కీర్తికి ఖరీదైన ఆస్తులలో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. బీఎండ‌బ్ల్యూ ఎక్స్ 7 సీరిస్ ఒక‌టి. దీని ధర దేశీయ‌ మార్కెట్ లోనే 1. 50 కోట్ల నుంచి 1.78 కోట్ల వరకు ఉంటుంది. అలాగే మెన్స్ డేస్, బెంజ్, టయోటా, ఇన్నోవా, క్రిస్టా లాంటి కార్లు కూడా కీర్తి ఖాతాలో ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news