MoviesNTR 30లో జాన్వీయే కాదు.. రెండో హీరోయిన్ కూడా ఫిక్స్‌...!

NTR 30లో జాన్వీయే కాదు.. రెండో హీరోయిన్ కూడా ఫిక్స్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఏకంగా ఏడాది పాటు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు. కొరటాల ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో రగిలిపోతున్నాడు.

కాస్టింగ్ విషయంలోనూ కొరటాల ఎక్కడ రాజీ పడటం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ కి జోడిగా దివంగ‌త‌ అతిలోక అందాల సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎంపికైంది. ఈ ప్రాజెక్టు కోసం తాను ఎంతో ఆసక్తితో ఉన్నాను అని జాన్వి కూడా ఎన్నోసార్లు తెలిపింది. ఈ సినిమా గురించి మరో అదిరిపోయేట్ ట్విస్ట్ కూడా బయటికి వచ్చింది. ఎన్టీఆర్‌కు జోడిగా ఒక జాన్వి మాత్రమే కాదు సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా ఉందట. కథ‌ డిమాండ్ మేరకు సెకండ్ హీరోయిన్ కుడా ఉందని.. సెకండ్ హీరోయిన్‌ను కూడా ఎంపిక‌ చేసినట్టు తెలుస్తోంది.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన మృణాల్‌ ఠాకూర్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఎన్టీఆర్‌కు జోడిగా అటు జాన్వీ.. ఇటు మృణాల్ ఠాగూర్ ఇద్దరు కనిపిస్తే స్క్రీన్ షేక్ అయిపోవడం ఖాయం. త్రిబుల్ ఆర్‌ లాంటి సూపర్ హిట్ తో ఎన్టీఆర్‌కు అదిరిపోయే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇమేజ్‌ను ఈ సినిమాతో కూడా నేషనల్ లెవెల్ లో కంటిన్యూ చేసుకోవాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు.

ఇక కొరటాలు కూడా ఎక్కడా రాజీ పడకుండా తన స్టైల్ కు భిన్నంగా ఈ సినిమాలో బాగా యాక్షన్ దట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే నెలలో రిలీజ్ చేయనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news