Moviesఆ హీరోయిన్ ప్రేమ‌లో బాల‌య్య‌... వ‌సుంధ‌ర క‌న్నీళ్లు... షాకింగ్ క్లైమాక్స్‌..!

ఆ హీరోయిన్ ప్రేమ‌లో బాల‌య్య‌… వ‌సుంధ‌ర క‌న్నీళ్లు… షాకింగ్ క్లైమాక్స్‌..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నారు. అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ హిట్లతో పాటు అన్ స్టాప‌బుల్ షో తో బాలయ్య క్రేజ్‌ మామూలుగా లేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాపై కూడా టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య తన కెరీర్లొ ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నో సినిమాల్లో నటించారు.

విజయశాంతి, భానుప్రియ, సిమ్రాన్, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే ఇలా ఎంతోమంది హీరోయిన్లను రిపీట్ కూడా చేశారు,అయితే విజయశాంతితో బాలయ్య ఎక్కువ సినిమాలలో నటించినప్పుడు వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న పుకార్లు అయితే ఉండేవి. వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 17కు పైగా సినిమాలు వస్తే అందులో ఎక్కువ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

అయితే బాలయ్యకి ప్రారంభంలోనే ఒక హీరోయిన్ తో ఎఫైర్ నడిచినట్టు అప్పట్లో వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు తమిళ‌ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ. అప్పట్లో బాలయ్య చెన్నైలో ఉండేవారు. ఖుష్బూతో ఏర్పడిన పరిచయంతో వారిద్దరూ షూటింగ్ అయిపోయాక బయట చెట్టపట్టలేసుకొని తిరిగేవారట. అప్పుడే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళుతున్నారు.

బాలయ్య ఖుష్బూనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆగ్రహించిన‌ ఎన్టీఆర్ ఆగమేఘాల మీద కాకినాడకు చెందిన వసుంధరతో బాలయ్య పెళ్లి చేసేసారు. త‌న ఇంటి కోడ‌లు సంప్ర‌దాయ కుటుంబానికి చెందిన అమ్మాయే రావాల‌ని.. త‌న కొడుకును బాగా చూసుకోవాల‌న్న‌దే ఎన్టీఆర్ కోరిక‌. అందుకే సినిమా హీరోయిన్ ఖుష్బూను కోడ‌లిగా ఒప్పుకోలేదు.

అయితే పెళ్లి తర్వాత కూడా బాలయ్య – ఖుష్బూ మధ్య ఆ బంధం కొనసాగేదట. ఈ విషయం వసుంధరకు తెలియడంతో భర్తను మార్చుకునేందుకు చాలాసార్లు సర్ది చెప్పిందట. అయితే బాలయ్య వసుంధ‌ర మాట‌ను ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో ఒకసారి నేరుగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుందట. వెంటనే ఎన్టీఆర్ ఏం చేశారో ? తెలియదు గానీ అక్కడి నుంచి ఖుష్బూ బాలయ్య వైపు చూడటం మానేసింది. అప్పట్లో ఈ విషయం సినిమా వర్గాల్లో బాగా హాట్‌ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news