MoviesSreeleela టాలీవుడ్‌లో శ్రీలీల లైన‌ప్ చూస్తే క‌ళ్లు తిరిగి కిందప‌డాల్సిందే…!

Sreeleela టాలీవుడ్‌లో శ్రీలీల లైన‌ప్ చూస్తే క‌ళ్లు తిరిగి కిందప‌డాల్సిందే…!

టాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా త‌ళుక్కున మెరిసింది శ్రీలీల‌. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా గౌరి రోనంకి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లిసంద‌డి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి స‌క్సెస్ ద‌క్కించుకున్న ఆమె కాస్త గ్యాప్ తీసుకుని ర‌వితేజ‌కు జోడీగా ధ‌మాకా సినిమా చేసింది. ధ‌మ‌కా అయితే ఏకంగా రు.120 కోట్లు కొల్ల‌గొట్టి ర‌వితేజ కెరీర్‌లోనే తిరుగులేని ఆల్ టైం బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది.

అస‌లు ఇప్పుడు శ్రీలీల లైన‌ప్ చూస్తుంటే క‌ళ్లు తిరిగిపోయి మ‌తిపోయేలా ఉంది. ప్ర‌స్తుతం ఆమెను ర‌వితేజ స్వ‌యంగా త‌న కొత్త సినిమాలో బుక్ చేయాల‌ని నిర్మాత‌ల‌పై ఒత్తిడి చేస్తున్నాట్ట‌. ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న సినిమాలో శ్రీలీల ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఉన్నా కూడా అంద‌రి క‌ళ్లు మ‌హేష్ – శ్రీలీల మీదే ఉన్నాయి.

ఇక నితిన్‌తో వ‌క్కంతం వంశీ తీస్తోన్న సినిమాతో పాటు బాల‌య్య – అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న బాల‌య్య 108వ సినిమాలోనూ శ్రీలీల కీల‌క పాత్ర చేస్తోంది. బాల‌య్య కూతురుగా ఆమెకు కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంద‌ని అంటున్నారు. రామ్ – బోయ‌పాటితో తీస్తోన్న సినిమాతో పాటు న‌వీన్ పోలిశెట్టితో అన‌గ‌న‌గా ఒక రోజు – పంజా వైష్ణ‌వ్ తేజ్ నెక్ట్స్ సినిమా, కిరీటి జానియ‌ర్ మూవీ సినిమాల్లోనూ ఆమె హీరోయిన్‌.

ఇక ఆమెకు ఏకంగా న‌క్క తోక తొక్కేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కోసం ముందుగా పూజాహెగ్డేను అనుకుని.. ఇప్పుడు ఆమె ప్లేస్‌లో శ్రీలీల‌ను ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు మ‌రో బంప‌ర్ ఛాన్స్ శ్రీలీల కొట్టేసింది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెర‌కెక్కే సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా ఫైన‌ల్ చేసేశారు.

ఒక్క సితార బ్యాన‌ర్లోనే ఆమెకు నాలుగు ఛాన్సులు.. ఇప్పుడు మ‌రో రెండు …ఇలా మొత్తం ఆమె చేతిలో ఐదారు పెద్ద ఆఫ‌ర్లు ఉన్నాయి. అస‌లు ఈ సినిమాలు పూర్త‌య్యే స‌రికి శ్రీలీల క్రేజ్‌, రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవ‌డానికే అంద‌డం లేదు. ఏదేమైనా శ్రీలీల టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూనే న‌క్క తోక తొక్కేసింది. త్వరలోనే బన్నీ, తారక్ లతో కూడా జతకట్టబోతున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news