Moviesఅదే జరిగితే రష్మిక మందన్నా వికెట్ ఔట్ ..? ఇక...

అదే జరిగితే రష్మిక మందన్నా వికెట్ ఔట్ ..? ఇక మనకు కనిపించదా..?

సినిమా ఇండస్ట్రీలో తలరాతలు రాత్రులకి రాత్రులు మారిపోతూ ఉంటాయి . పాపం అలా జరిగిన ఓ మాయకే రష్మిక మందన కూడా బలైపోతుంది. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీ సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు ఒక్క బోర్లా పడిపోయారు . రష్మిక మందన కూడా అదే జాబితాలోకి పడిపోయింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి పాగ వేయడానికి జంప్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని అవకాశాలు అందుకున్న రష్మిక .. బాలీవుడ్ లో ఏకంగా ఏడు బడా ప్రాజెక్టులకు సైన్ చేసింది .

ఆశ్చర్యం ఏంటంటే .. ఇప్పటివరకు ఆమె బాలీవుడ్ లో నటించిన సినిమా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. కానీ ఆఫర్లు మాత్రం తన్నుకొచ్చేస్తున్నాయి . కాగా ప్రజెంట్ రష్మిక తన ఆశలన్నీ టాలీవుడ్ లో నటిస్తున్న పుష్ప 2 పై ..బాలీవుడ్లో నటించిన యానిమల్ పై పెట్టుకుని ఉంది . కాగా ఇలాంటి క్రమంలోనే మరో క్రేజీ ఆఫర్ పట్టేసింది రష్మిక. వెంకి కుడుముల డైరెక్షన్ లో నితిన్ హీరోగా మరో సినిమాకు ఫిక్స్ అయింది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేసింది .

అయితే ఇలాంటి క్రమంలోనే రష్మిక నిర్ణయానికి సినీ విశ్లేషకులు షాక్ అవుతున్నారు . ఈ సినిమాల్లో రష్మిక గ్లామరస్ పరంగానే కనిపిస్తుంది కానీ ఎక్కడ కంటెంట్ పరంగా ముందుకు వెళ్ళదు.. నటనపరంగా నటించే స్కోప్ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . మరి అలాంటి క్యారెక్టర్ ని చూస్ చేసుకుని రష్మిక తప్పు చేసిందని,, ఒకవేళ ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమా ఫ్లాప్ అయినా సరే ..రష్మిక కెరియర్ అవుట్ అని .. ఇకపై ఆమె తెలుగు తెరపై కనిపించే ఛాన్స్ ఉండదని అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news