Moviesటాలీవుడ్ లో ఏ హీరో కోసం అలా చేయను.. ఒక్క ఎన్టీఆర్...

టాలీవుడ్ లో ఏ హీరో కోసం అలా చేయను.. ఒక్క ఎన్టీఆర్ కోసమే చేస్తా..ఫ్యాన్స్ ని ఎక్కడో టచ్ చేసిన విశ్వక్ సేన్ ..!!

ప్రజెంట్ ..సినిమా ఇండస్ట్రీలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిందే. ఉన్నది ఉన్నట్లు ముఖానే మాట్లాడేసి తెలుగు యంగ్ హీరో అంటే జనాలు పడి చచ్చిపోతున్నారు. రీసెంట్ గానే ధాస్ కి ధమకి అనే సినిమా తో ధియేటర్స్ లో హంగామా చేస్తున్న విశ్వక్ సేన్ ఫస్ట్ షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

తానే డైరెక్టర్ తానే హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ డేనే ఎనిమిది కోట్లు గ్రాస్ అందుకుంది. ఆ తర్వాత రోజు నాలుగు కోట్లకు పైగానే షేర్స్ వసూలు చేసింది . ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ లో డైరెక్టర్ కూడా దాగి ఉన్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా దాస్ కి ధమ్ కి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్.

ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్ చేశారు . ఈ సినిమాలో హీరోగా .. విలన్ రోల్ లో మీరే నటించారు .. ఫ్యూచర్ లో అలా నటించే అవకాశం ఉందా..? మంచి అవకాశాలు వస్తే విలన్ గా నటిస్తారా..? అని హోస్ట్ అడగడంతో.. నాకు అవకాశం వస్తే నేను కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో మాత్రమే విలన్ గా నటిస్తాను.. మరి ఏ హీరో సినిమాలో నటించిన అంటూ ఓపెన్ గా చెప్పేసాడు.

మనకు తెలిసిందే మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే విశ్వక్ సేన్ కు చాలా ఇష్టం . ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అటెండ్ అయ్యాడు . ఆయనంటే విశ్వక్ సేన్ కు ప్రాణం . ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విశ్వక్సేన్ . చూడాలి మరి ఎన్టీఆర్ .. విశ్వక్సేన్ కి అలాంటి అవకాశం ఇస్తారో ..? లేదో..? ప్రజెంట్ విశ్వక్ సేన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news