Movies"అలా చేసిన రేప్ తో సమానమే"..ఫస్ట్ టైం బోల్డ్ గా ...

“అలా చేసిన రేప్ తో సమానమే”..ఫస్ట్ టైం బోల్డ్ గా మాట్లాడిన సాయిపల్లవి..!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్స్ చాలా తక్కువ . ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఎక్కడ నిజాలు బయటపడిపోతాయో అన్న భయంతో కొందరు హీరోయిన్స్ నోరు కట్టేసుకుని ఉంటారు . మరి కొంతమంది హీరోయిన్స్ మాట్లాడాలని ఉన్న ఈ జనాల ట్రోలింగ్కి.. ఆ తర్వాత అవకాశాలు ఎక్కడ ఇవ్వరో అని తెలిసి భయపడుతూ బాధపడుతూ నిజాన్ని తెలిసిన.. మింగలేక కక్కలేక మధ్యలో నలిగిపోతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ ఎవరు ఏమనుకున్నా ..ఐ డోంట్ కేర్ సినిమాలు లేకపోతే …ఏదో ఒకటి చేసుకుని బతుకుతాను అంటూ ఉన్నది ఉన్నట్లే ముఖాన్ని మాట్లాడేస్తారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి.

ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే పుష్ప2 సినిమాలో ఓ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు మహేష్ బాబు సినిమాలోను అవకాశం అందుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే “నిజం విత్ స్మిత” అనే టాక్ షోలో పాల్గొనింది సాయి పల్లవి. కాగా రీసెంట్గా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే స్మిత సాయి పల్లవి తో చేసిన రచ్చ హైలైట్ గా మారింది. ఆమెని షోలో కి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఎంట్రీ ఇవ్వడంతోనే నవ్వులు పోయించింది స్మిత .

ఆమె గురించి గొప్పగా ఇంట్రో ఇచ్చింది స్మిత . ఈ క్రమంలోనే మంచి మెడికో అని చెప్పకపోవడంతో సాయి పల్లవి సైలెంట్గా పంచ్ వేసింది . దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి. అనంతరం ఆమె ఎన్టీఆర్ ..అల్లు అర్జున్ ..రామ్ చరణ్ లాంటి వాళ్ళతో డాన్స్ చేయాలని ఉంది అంటూ మనసులోని మాట బయట పెట్టింది . ఈ క్రమంలోనే అనంతరం మీటూ గురించి ప్రశ్నించింది స్మిత. “ఒకప్పుడు మీటూ సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఎంతోమంది మహిళలు తమ ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకున్నారు. దానిపై మీ అభిప్రాయం అని అడగ్గా.. సాయి పల్లవి స్పందిస్తూ ..కేవలం శారీరకంగా టార్చర్ చేస్తేనే అది మీటూ వివాదం అవుతుందా..? మాటలతో గుచ్చి గుచ్చి మనిషిని క్షోభ పెట్టిన అది మీటూ కిందకే వస్తుంది.. అలా ఇబ్బంది పెట్టిన అది వేధింపులకు సమానమే అవుతుంది “అంటూ షాక్ ఇచ్చింది . ఈ క్రమంలోని సాయి పల్లవి మాటలను సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ” నిజమే కదా మాటలతో మనుషుల్ని ఇబ్బంది పెట్టిన అది రేప్ కి సమానమే “అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news