Moviesప్రపంచం తల కిందులైన..అది జరిగితేనే ప్రభాస్ పెళ్లి.. ఫైనల్లీ క్లారిటీ వచ్చేసిందిగా..!!

ప్రపంచం తల కిందులైన..అది జరిగితేనే ప్రభాస్ పెళ్లి.. ఫైనల్లీ క్లారిటీ వచ్చేసిందిగా..!!

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ప్రభాస్ పెళ్లి గురించి అని చెప్పాలి . టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ అంతకంటే ఎక్కువ స్ధాయి సినిమాలను చూస్ చేసుకుంటున్నాడే తప్పిస్తే.. పెళ్లిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన ఇచ్చిందే లేదు .

ఇదిగో పెళ్లి ..రేపు మాపో అఫీషియల్ ప్రకటన వస్తుంది రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి తప్పిస్తే అఫీషియల్ గా నోరు తెరిచి ప్రభాస్ తన పెళ్లి పై స్పందించిన దాఖలాలే లేవు . అప్పుడెప్పుడో ఆన్ స్టాపుబుల్ షోలో బాలయ్య పుణ్యమా అంటూ ప్రభాస్ తన పెళ్లి పై నోరు విప్పాడు ..తప్పిస్తే అప్పటినుంచి ఇప్పటివరకు ప్రభాస్ తన పెళ్లి ఊసు ఎత్తిందలేదు. వాళ్ల అమ్మగారు ప్రభాస్ పెళ్లి పై కీలక అప్డేట్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రజెంట్ ప్రభాస్ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నారు . అది షూటింగ్ కోసం వెళ్లారా ..? పర్సనల్ హెల్త్ ప్రాబ్లం కోసం వెళ్లారా..? అన్నది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. అయితే ప్రభాస్ నటించిన సలార్ సినిమా, ప్రాజెక్టుకే సినిమా రిలీజ్ అవ్వగానే ప్రభాస్ పెళ్లి చేసుకునేస్తాడని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాస్ 2024 లో పెళ్లి చేసుకొని అభిమానులకు గుడ్ న్యూస్ ఇస్తాడని ప్రభాస్ అమ్మగారు తన బంధువులకు క్లారిటీ ఇచ్చిందట.

ఇప్పటికే ఏ ఫంక్షన్ కి వెళ్ళిన ప్రభాస్ పెళ్లి గోల పెద్దగా తలనొప్పిగా మారిపోతున్న క్రమంలో వాళ్ళ అమ్మగారు ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ప్రభాస్ ఇక ఎన్ని చెప్పినా సరే ఆగేదే లేదు అంటూ కూడా తేల్చేసిందట . ప్రభాస్ పెళ్లి జరిగితే జరిగినట్టు లేదంటే పెద్ద లొల్లి చేస్తాము అంటున్నారు ఫ్యాన్స్. దీంతో టోటల్గా 2024లో ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ వచ్చే ఛాన్స్ పక్కాగా కనిపిస్తున్నాయి ..చూద్దాం 2024 ప్రభాస్ కి ఎలా కలిసి వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news