Moviesఫైనల్లీ ..పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీ ప్రసాద్.. అమ్మాయి ఎవరంటే..?

ఫైనల్లీ ..పెళ్లి చేసుకోబోతున్న దేవిశ్రీ ప్రసాద్.. అమ్మాయి ఎవరంటే..?

ఫైనల్లీ.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లపాటు సంగీత ప్రపంచాన్ని ఏలేసిన దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు . ఏదో పుష్ప సినిమాలో ఉంటావా మామ పాట హిట్ కారణంగా దేవి శ్రీ ప్రసాద్ పేరు నాలుగు సార్లు అయినా వినిపించిందే కానీ ఆ తర్వాత తమన్ దెబ్బకి దేవిశ్రీప్రసాద్ బొక్క బోర్లా పడిపోయాడు .

ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా దేవిశ్రీకి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరూ తమన్ పేరునే జపిస్తున్నారు . ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ చాప్టర్ క్లోజ్ అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి. కాగా ఇలాంటి క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడట . మనకు తెలిసిందే.. గతంలో చార్మితో దేవిశ్రీప్రసాద్ ప్రేమాయణం నడిపాడు. పెళ్ళికూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ సడన్గా ఏమైందో ఏమో తెలియదు ఆమెను దూరం పెట్టాడు.

తన తండ్రి మరణించిన తర్వాత దేవిశ్రీప్రసాద్ పెళ్లిపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదట. ఫైనల్లీ ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు దేవి శ్రీ ప్రసాద్. దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు ..తన సొంత మరదల్ని . వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు . ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు ఎవరు హాజరు కాలేరు. ఎందుకంటే ఆయన ఈ పెళ్లి ని హంగామా లేకుండా సింపుల్గా చేసుకోవడానికి చూస్తున్నాడట . ఆ తర్వాత గ్రాండ్గా తన వెడ్డింగ్ అనౌన్స్ చేసే విధంగా దేవిశ్రీప్రసాద్ ప్లాన్ చేసుకున్నారట .దీంతో మరోసారి దేవి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news