Moviesదాని వదిలేస్తే కృతి శెట్టి లైఫ్ సగం బాగుపడిన్నట్లే.. ఓపెన్ గా...

దాని వదిలేస్తే కృతి శెట్టి లైఫ్ సగం బాగుపడిన్నట్లే.. ఓపెన్ గా చెప్పేస్తున్న డైరెక్టర్లు..!!

టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కన్నడ బ్యూటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కని విని ఎరుగని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదే క్రమంలో ఆ తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేసాయి.

ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా కృతి శెట్టి పేరు మారుమ్రోగిపోయింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టిని జనాలు పట్టించుకోవడం కూడా మానేశారు. డైరెక్టర్లు మరిచిపోయిన జనాలకు తన పేరుని గుర్తు చేసేలా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది కృతి శెట్టి . అయితే చేయాల్సింది ఫోటోషూట్స్ కాదని తను బ్లైండ్ గా ఫిక్సయిన కొన్ని రూల్స్ ను బ్రేక్ చేస్తే కృతి శెట్టి ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అయిపోయినట్లే అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు .

మొదటినుంచి కృతి శెట్టి తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుందట . సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పాత్రలే చేయాలి.. ఇలాంటి రోల్స్ కి పరిమితం అవ్వాలి అని కండీషన్స్ పెట్టుకున్న కృతిశెట్టి..ఆ రూల్స్ ని బ్రేక్ చేస్తే హాట్ ఆఫర్స్ వస్తాయని ..ఒకటి కాకపోయినా ఒకటి సినిమా హిట్ అయినా లైఫ్ టర్న్ అయిపోతుందంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే కృతి శెట్టి మాత్రం తాను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేసేదేలే అంటూ భీష్ముంచుకుని కూర్చుందట . ఈ క్రమంలోనే ఆమె కెరియర్ మరింత కష్టాల్లో పడిపోయేలా చేసుకుంది అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news