Moviesద్యావుడా..ఇంత దారుణంగా చరణ్ ని ముంచేసావ్ ఏంట్రా బాబు..బర్తడే రోజే భారీ...

ద్యావుడా..ఇంత దారుణంగా చరణ్ ని ముంచేసావ్ ఏంట్రా బాబు..బర్తడే రోజే భారీ బొక్క పెట్టావ్ గా శంకరా..?

అబ్బబ్బా.. ఈ శంకర్ ఏంటి ఇలా మెగా అభిమానులకు రాడ్ దించేశాడు..? ఊరించి ఊరించి ఉసురుమనిపించాడు..యస్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు . ఈరోజు ని మెగా అభిమానులు ఓ పండగల సెలబ్రేట్ చేసుకుంటారు . ప్రతి సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసి అభిమానులు తమ సొంత మనిషి పుట్టిన రోజు లాగే ఆనందపడుతూ ఉంటారు. కాగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను గ్రాండ్గా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు మెగా అభిమానులు .

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా నుంచి టైటిల్ ని రివిల్ చేశారు చిత్ర బృందం . కాగా ఇన్నాళ్ల నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తారా ..? ఎలాంటి టైటిల్ పెడతారా..? అంటూ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేశారు. సీన్ కట్ చేస్తే కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన టైటిల్ ని చూసి మెగా అభిమానులు బొక్క బోర్లా పడిపోయారు. ఇన్నాళ్లు ఈ సినిమాకి ఏదో ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసే టైటిల్ని పెడతారు అనుకున్నా అభిమానులకు స్టార్ట్ డైరెక్టర్ శంకర్ బిగ్ రాడ్ ని దించేసిన్నట్లైంది.

తాజాగా సోమవారం ఉదయం సినిమా టైటిల్ ని ప్రకటించారు మూవీ టీం. టైటిల్ కి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ను విడుదల చేస్తూ ఈ సినిమాకి “గేమ్ చేంజర్” అనే టైటిల్ ని ఖరారు చేశారు . అయితే ఈ సినిమాకి టైటిల్ ఇదే అంటూ గతంలో సర్కారోడు , సీఈఓ అంటూ సరికొత్త టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. ఇలా ఎవరు ఊహించిన విధంగా గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని పెట్టడం మెగా ఫాన్స్ ను హార్ట్ చేసినట్లయింది. అసలు గేమ్ చేంజర్ ఏంటి ..? ఈ టైటిల్ లో మీనింగ్ ఏముంది ..? సినిమా కంటెంట్ కి.. కథకి.. రామ్ చరణ్ లుక్స్ కి అసలు సంబంధం లేదు .

మొత్తంగా చూస్తుంటే రామ్ చరణ్ సినిమాను సంక నాకించేటట్ట్లే ఉన్నావు కదా శంకరా..? అంటూ కొందరు జనాలు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు మెగా ఫాన్స్ కి సైతం ఈ టైటిల్ నచ్చలేదు అంటే శంకర్ ఎంత డిజాస్టర్ గా ఈ టైటిల్ ని పెట్టాడో ఊహించుకోవచ్చు. ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ టైటిల్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి . అంతేకాదు మధ్యాహ్నం మూడు గంటలకు మరో అప్డేట్ ఇవ్వబోతున్నాము అంటూ ప్రకటించింది మూవీ టీం..చూడాలి ఈ అప్డేట్ తో అయినా మెగా అభిమానులను కూల్ చేస్తాడో లేదో ఈ శంకర్ ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news