Moviesహ‌రికృష్ణ చేసిన ఆ ఒక్క ప‌నితోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌హార్జాత‌కం ప‌ట్టుకుందా..!

హ‌రికృష్ణ చేసిన ఆ ఒక్క ప‌నితోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌హార్జాత‌కం ప‌ట్టుకుందా..!

గడిచిన మూడు రోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమ్రోగుతోంది. ఆస్కార్ వేదికలో సైతం అవార్డ్ వచ్చిన సమయంలో బ్యాగ్రౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆస్కార్ అవార్డ్స్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ఐడీని ఎక్కువమంది ట్యాగ్ చేయడంతో ఆ విధంగా కూడా ఎన్టీఆర్ పేరు రికార్డులకెక్కింది.

అయితే టెంపర్ సినిమాకు ముందు వరుసగా ఆరు ఫ్లాపుల వల్ల జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఇబ్బంది పడ్డారు. శక్తి సినిమా నుంచి రభస సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. బాద్ షా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాపుల వల్ల ఇబ్బందులు పడుతుండటంతో ఆ సమయంలో హరికృష్ణ జ్యోతిష్కులను సంప్రదించారట.

జూనియర్ ఎన్టీఆర్ జాతకాన్ని పరిశీలించి జ్యోతిష్కులు ఆయన జాతకంలోని దోషాలు అన్నీ తొలగిపోయేలా హోమాలను నిర్వహించారు. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా హరికృష్ణ జాగ్రత్త పడగా ఆ జ్యోతిష్కులు తాజాగా ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆ హోమాల అనంతరం తారక్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

జూనియర్ ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టలు పెరగడానికి ఆ హోమాలు కూడా పరోక్షంగా ఉపయోగపడ్డాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ సినిమాకు కాంతార తరహా టచ్ ఉంటుందని తెలుస్తోంది. ప్రేక్షకుల ఊహకు అందని కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. నందమూరి వంశ కీర్తి ప్రతిష్టలను పెంచేలా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news