Moviesబిగ్ షాకింగ్: ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ రావడానికి చిరంజీవి...

బిగ్ షాకింగ్: ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ రావడానికి చిరంజీవి అలా చేసాడా..? బయటపడ్డ సంచలన సీక్రేట్..!!

ఇన్నాళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సినీ జనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమా అందుకొని కనీ విని ఎరుగని సంచలనాన్ని క్రియేట్ చేసింది . కాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకుంది.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ రావడానికి వెనుక చిరంజీవి హస్తం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . తన కొడుకు నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలి అంటూ నాన్న చిరంజీవి ఎన్నో హోమాలు వేయించారట. పూజలు చేయించారట. లక్షలు ఖర్చు చేసి అన్నదానాలు చేయించారట . ఆ విషయాన్ని బయటికి రానికుండా కప్పి పెట్టేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఫైనల్లీ తన కొడుకు దేశం గర్వించదగ్గర నటనలో ఒకరుగా ఉన్నందుకు సంతోషపడుతున్నాను అంటూ మీడియా ముందు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోని అసలు విషయం బయటపడటంతో మెగా ఫాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడానికి వెనక చిరంజీవి ఇంత చేశాడా..? నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి గాని.. మెగా ఫ్యామిలీ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. చూడాలి మరి ఈ వార్త నిజమేనా..? లేక కొందరు కావాలని ఆయన పై బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారా..? తెలియాలంటే మెగాస్టార్ చిరంజీవి నోరు విప్పాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news