MoviesNTR 30 నుండి క్రేజీ పిక్స్ లీక్.. రక్తపు ట్యాంకర్లతో కొరటాల...

NTR 30 నుండి క్రేజీ పిక్స్ లీక్.. రక్తపు ట్యాంకర్లతో కొరటాల అరాచకం.. ఫ్యాన్స్ కి ఊరమాస్ జాతర ఖాయం ..!!

కొరటాల శివ టైమింగ్ కి అదిరిపోయే రేంజ్ లో అప్రిషియేట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ 30 సినిమా స్టార్ట్ అవుతుందా..? కీలక అప్డేట్స్ ఇస్తారా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే రీసెంట్ గానే ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.

దీంతో ఫుల్ ఖుషి లో ఉన్నా నందమూరి అభిమానులకు మరొక క్రేజీ న్యూస్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది . ఎన్టీఆర్ థర్టీ సెట్స్ నుంచి ఒక క్రేజీ పిక్ లీక్ అయింది .ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ఏకంగా రక్తపు టాంకర్లను వాడుతున్నాడు కొరటాల శివ అంటూ కన్ఫామ్ అయిపోయింది. రక్తం ఏరులై పారబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా ఈ సెట్స్ నుంచి రిలీజ్ అయిన బ్లడ్ ట్యాంకర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇప్పటివరకు సినిమాలలో బాటిల్స్ , టిన్స్, క్యాన్స్ బ్లడ్ ని యూస్ చేశారు ..కానీ కొరటాల ఫస్ట్ టైం ఈ సినిమా కోసం ఏకంగా రక్తపు ట్యాంకర్లనే వాడబోతున్నారు అని తెలిసిపోయింది . ఎన్టీఆర్ 30 సెట్స్ నుంచి నీరు కాకుండా నకిలీ రక్తం నిండి ఉన్న ట్యాంకర్ పిక్ లీకైంది. ఈ క్రమంలోనే సినిమాలో ఏ రేంజ్ మాస్ జాతర ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు కొరటాల శివ. ఎన్టీఆర్ 30 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం ఇది వాడబోతున్నారని తెలుస్తుంది .

అంతేకాదు చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ని ఆది లాంటి ఊర మాస్ పాత్రలో చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తారక్ ఫ్యాన్స్ ఇక బ్లడ్ బాత్ గ్యారెంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు . ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ థర్టీ సినిమా ఇండస్ట్రీ చరిత్ర ను తిరగరాయబోతుంది అంటు ఫిక్స్ అయిపోయారు జనాలు. కచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతుంది అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news