Moviesబన్ని - చరణ్ - ఎన్టీఆర్: ఈ ముగ్గురులో ఆ సత్త...

బన్ని – చరణ్ – ఎన్టీఆర్: ఈ ముగ్గురులో ఆ సత్త ఉన్న రియల్ హీరో ఎవ్వరు..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య వార్ ఏ విధంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హీరో నుంచి స్టార్ హీరోగా.. ఆ తర్వాత పాన్ ఇండియా హీరోగా ఇప్పుడు ..గ్లోబల్ స్టార్ హీరోగా మారి ట్యాగ్ చేయించుకుంటూ మన టాలీవుడ్ స్టార్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . ప్రధానంగా ముగ్గురు హీరోల మధ్య ఈ వార్ జరుగుతున్నట్లు తెలుస్తుంది . వాళ్లే ఎన్టీఆర్ – చరణ్ – బన్నీ…

ఎస్.. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో ప్లేస్ సంపాదించుకున్న చరణ్ – తారక్ మధ్య ఎలాంటి టఫ్ ఫైట్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వాళ్ళిద్దరికీ ఏమాత్రం తీసిపోను అంటూ బన్నీ కూడా మేటర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. పుష్ప 2 సినిమాతో ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తూ సినీ ఇండస్ట్రిని షేక్ చేస్తున్నాడు బన్నీ . ఈ క్రమంలోనే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ హీరోని హైప్ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు . కాగా ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతుంది .

మేం గ్లోబల్ హీరోస్ అంటూ చెప్పుకునే ఈ ముగ్గురు హీరోలలో నిజమైన గ్లోబల్ హీరో ఎవరు అన్న టాక్ వైరల్ అవుతుంది. ముగ్గురు కూడా తమ నెక్స్ట్ సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా ఈక్వల్ గా .. ఏమాత్రం ఒకరినొకరు తీసిపోకుండా మెయింటైన్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తెలుగు ఇండస్ట్రీకి చెరగని ఇమేజ్ ని తీసుకొస్తున్నారు . అయితే ఈ ముగ్గురులో రియల్ హీరో ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

అయితే ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోలను ట్యాగ్ చేసుకుంటూ ఉంటే కామన్ హీరో ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగా తారక్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే పలువురు ప్రముఖులు కూడా నెంబర్ వన్ హీరో అంటూ ట్యాగ్ చేసి ఓట్లు వేస్తున్నారు . ఈ క్రమంలోని బన్నీ – చరణ్ -NTR ల ల్లో రియల్ సత్తా ఉన్న హీరో ఎవరు అంటూ పోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి . అయితే మీ దృష్టిలో రియల్ గ్లోబల్ హీరో ఎవరు..? పుష్ప సినిమాతో చరిత్రను తిరగరాయబోతున్న బన్నీనా..? ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసిన ఎన్టీఆర్ – చరణ్ నా..? కామెంట్స్ రూపంలో మీ ఆన్సర్ ని తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news