Movies8 పాత్ర‌ల్లో బాల‌య్య‌... అట్ట‌ర్ ప్లాప్ అన్నారు.. క‌ట్ చేస్తే సూప‌ర్...

8 పాత్ర‌ల్లో బాల‌య్య‌… అట్ట‌ర్ ప్లాప్ అన్నారు.. క‌ట్ చేస్తే సూప‌ర్ హిట్‌..!

బాలకృష్ణ కెరీర్లో సమరసింహారెడ్డి ఎంత పెద్ద హిట్ సినిమాయో తెలిసిందే. 1999 సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి స్నేహంకోసం సినిమాకు పోటీగా వ‌చ్చింది. స్నేహంకోసం జ‌న‌వ‌రి 1న రిలీజ్ అయితే.. స‌మ‌ర‌సింహారెడ్డి సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో పాటు అప్ప‌టికి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా సిమ్రాన్‌, అంజ‌లాఝ‌వేరి, సంఘ‌వి హీరోయిన్లుగా న‌టించారు. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఆ రోజుల్లో 77 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య సుల్తాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అదే యేడాది సుల్తాన్ ఆ త‌ర్వాత కృష్ణ‌బాబు సినిమాలు చేశాడు.

ఇక సుల్తాన్ సినిమాకు శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాల‌య్య పెద్ద‌న్న‌య్య సినిమాకు ఆయనే డైరెక్ట‌ర్‌. సుల్తాన్ సినిమాలో దీప్తీ భ‌ట్నాగ‌ర్‌, ర‌చ‌న, రోజా న‌టించారు. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టులు కృష్ణ‌, కృష్ణంరాజు కూడా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ సినిమాలో బాల‌య్య ఏకంగా 8 పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. అప్ప‌ట్లో ఇది ఓ సెన్షేష‌న‌ల్ అయ్యింది.

బాల‌య్య అటు సుల్తాన్ గాను, ఇటు పోలీస్ ఆఫీస‌ర్‌గాను క‌నిపిస్తారు. 1999 మే 27న రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ముందు విమ‌ర్శ‌కుల నుంచి మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. సినిమా ప్లాప్ అన్నారు. కానీ స‌మ‌ర‌సింహారెడ్డి మానియాలో ఈ సినిమా ఆ త‌ర్వాత పుంజుకుని సూప‌ర్ హిట్ అయ్యింది. అంటే సినిమా కొన్న వాళ్ల‌కు మంచి లాభాలు వ‌చ్చాయి. సినిమాలో పాట‌ల‌తో పాటు బాల‌య్య గెట‌ప్‌లు, యాక్ష‌న్ హైలెట్‌గా నిలిచాయి.

Latest news