Moviesఈ 6 గురు స్టార్ హీరోల ఫ‌స్ట్ సినిమాల్లో ఇన్ని ఇంట్ర‌స్టింగ్...

ఈ 6 గురు స్టార్ హీరోల ఫ‌స్ట్ సినిమాల్లో ఇన్ని ఇంట్ర‌స్టింగ్ ట్విస్టులు ఉన్నాయా…?

ప్రస్తుతం టాలీవుడ్ లో అంతా యంగ్ హీరోల డామినేషన్ కొనసాగుతోంది. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే ఇప్పటి తరం యంగ్ జనరేషన్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీరి హవానే ఎక్కువగా నడుస్తోంది.

ఎక్కువమంది సిని అభిమానులను కూడా ఈ హీరోలే కలిగి ఉన్నారు. వీరిలో ముందు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత 1999లో మహేష్ బాబు హీరో అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రెండేళ్ల‌ తేడాలో హీరోలు అయ్యారు. 2006లో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ స్టార్ హీరోలు తమ కెరీర్ తొలి సినిమాను ఏ ఏ దర్శకులు ? ఏయే హీరోయిన్ల‌తో పనిచేశారు అన్నది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు దివంగత దర్శకులు ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. అక్కినేని మనవరాలు యార్లగడ్డ సుప్రియ హీరోయిన్ గా పరిచయం అయింది. అల్లు అర‌వింద్ ఈ సినిమాకు నిర్మాత‌. సినిమా య‌బో యావ‌రేజ్‌గా ఆడింది.

సూపర్ స్టార్ మహేష్ :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాల నటుడుగా చాలా సినిమాలలో నటించారు. అయితే 1999లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వినీద‌త్‌ నిర్మించిన ఈ సినిమాకు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి ప్రీతిజింతా హీరోయిన్ గా నటించింది.

జూనియర్ ఎన్టీఆర్ :
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2000 సంవత్సరంలో ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంతకుముందే బాల నటుడుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాల రామాయణం సినిమాల‌లో నటించాడు. నాగార్జునతో నిన్ను చూడాలని లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన వంకినేని రత్న ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ కి జోడిగా రవీనా రాజ్ పుత్ హీరోయిన్‌గా నటించింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ :
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. జయంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలనాటి మేటినటి మంజుల కుమార్తె శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అశ్వినీద‌త్‌ నిర్మించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా నేహా శర్మ హీరోయిన్ గా పరిచయం అయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీకి జోడిగా దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ సినిమా కూడా ఓకే అనిపించుకుంది..

అయితే తొలి సినిమాతో హీరోగా పరిచయమైన స్టార్ హీరోలు అందరిలోనూ మహేష్ బాబు మాత్రమే రాజకుమారుడు సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత రామ్ చరణ్ చిరుత బాగానే ఆడింది. బన్నీ గంగోత్రి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news