Moviesటాలీవుడ్‌లో మ‌రో విడాకులు… ఈ సారి స్టార్ హీరో కూతురు వంతు…!

టాలీవుడ్‌లో మ‌రో విడాకులు… ఈ సారి స్టార్ హీరో కూతురు వంతు…!

ప్రస్తుతం సెలబ్రిటీల కాపురాలను కలిపినా… విడదీసినా అంతా సోషల్ మీడియానే అన్నట్టు తయారయింది. భార్యాభర్తల ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టా అకౌంట్లు చూసి వారిద్దరి మధ్య ఎలాంటి ? సయోధ్య ఉంది.. అసలు కలిసే ఉంటున్నారా ? లేదా విడిపోయారా అని ఎవరికి వారు రకరకాలుగా వార్తలు చిలువలు ప‌లువలు చేసి ప్రచారం చేసేస్తున్నారు. మొగుడు పెళ్ళాలు కాస్త దూరంగా ఉంటే చాలు ఇండస్ట్రీలో గాసిప్లు, కోళ్లుగా కూసేస్తున్నాయి.

టాలీవుడ్ లో ఇప్పుడు ఓ సీనియర్ హీరో కుమార్తె తండ్రి సినిమా పనులు చూసుకుంటూ హైదరాబాదులోనే ఎక్కువగా ఉంటున్నారు. త్వరలోనే ఆమె సినిమా నిర్మాణం కూడా చేపడతారని గుసగుసలు వస్తున్నాయి. అయితే భర్త మాత్రం ఆమెకు దూరంగా తన వ్యాపారాలు.. వ్యవహారాలు చూసుకుంటూ మరోచోట ఉంటున్నారు. దీంతో ఇద్దరికి మధ్య సంథింగ్ సంథింగ్ రాంగ్ అంటూ పుకార్లు వినిపించడం మొదలయ్యాయి.

పైగా సదరు భర్త గత ఆరు నెలలుగా తన ఇన్‌స్టా అకౌంట్లో త‌న‌ భార్య ఫోటోలు ఏవి షేర్ చేయలేదు.
అది మాత్రమే కాదు.. ఇటీవల ఆ ఫ్యామిలీలో విషాదం జరిగితే రాలేదు. ఇవన్నీ ఇప్పుడు గాసిప్ రాయుళ్లు అరాలు పేరాలు తీస్తున్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి పెద్దదిక్కు లాంటి పెద్దాయన ఇద్దరిని పిలిచి కాస్త మంచి చెడ్డ కూడా చెప్పి పంపించారని వినిపిస్తోంది.

ఇప్పటికే ఆ కుటుంబంలో రెండు మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. దీంతో ఈ జంట కూడా అదే బాటలో నడుస్తున్నారా ? అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news