Moviesఊహించ‌ని ట్విస్ట్‌… ప్ర‌భాస్ ' స‌లార్ ' మ‌ల్టీస్టార‌రా… ఆ స్టార్...

ఊహించ‌ని ట్విస్ట్‌… ప్ర‌భాస్ ‘ స‌లార్ ‘ మ‌ల్టీస్టార‌రా… ఆ స్టార్ హీరో కూడా ఉన్నాడోచ్‌..!

ఇప్పుడు సినిమాల్లో ట్రెండ్ మారిపోతుంది ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్న దానికి అదనంగా హంగులు కావాలి అప్పుడే జనాలు ఇష్టపడుతున్నారు. ఎంత కథాబలం ఉన్న అదనపు హంగులు ఉంటే ఆ సినిమా ఉంటుంది. చిరంజీవికి తోడుగా ఒక సినిమాలో రాంచరణ్, ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్, వాల్తేరు వీరయ్య‌ సినిమాలో రవితేజ.. అంతటి చిరంజీవి లాంటి హీరోకి ఇంకొకరు తోడుగా కావాలి. ఇప్పుడు అదే ఒక ట్రెండ్ గా మారుతుంది. అంటే సినిమాలలో ఐటమ్ సాంగ్ లాగా ఇది కూడా ఒక స్పెషల్ ఎట్రాక్షన్ అన్నమాట.

అయితే ఇది అన్ని సార్లు సక్సెస్ అవుతుందని చెప్పకపోయినా.. సినిమా రిలీజ్ కి ముందు ఒక క్రేజ్ గా అయితే ఉంటుంది. అంతెందుకు రీసెంట్గా వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ ట్రెండ్ పట్టుకున్నాడు. అసలు ప్రభాస్ సినిమాలో మరో హీరోకు చోటు ఉండదు. ఎందుకంటే తనకే స్క్రీన్ స్పేస్ సరిపోదు.. అయితే ఇప్పుడు మార్కెట్.. బిజినెస్ దృష్ట్యా తప్పట్లేదు. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో కే జి ఎఫ్ హీరో య‌ష్ గెస్ట్ రొల్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతలకు య‌ష్ అత్యంత సన్నిహితుడు. కేజీఎఫ్ సినిమాతో య‌శ్‌ క్రేజ్ దేశవ్యాప్తంగా తీసుకువెళ్లింది. కేజిఎఫ్ నిర్మాతలు విజయ్ కిరంగ‌దూర్, దర్శకుడు ప్రశాంత నీల్. దీంతో ఇప్పుడు వారిద్దరు అడిగిన వెంటనే ప్రభాస్ సలార్ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయడానికి య‌శ్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్ర‌భాస్‌కు ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. బాహుబలి సినిమాతో తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత అన్ని ప్లాపులే..!

సాహో డిజాస్టర్ అయితే నార్త్ లో మాత్రం ఒక మాదిరిగా ఆడింది. రాధేశ్యామ్ అయితే పేడ కల‌గా మిగిలిపోయింది. ఆదిపురుష్‌ ఏం జరుగుతుందో ? అన్న ఆందోళన ఉంది. ఇవన్నీ మర్చిపోవాలంటే స‌లార్ ఒక రేంజ్ లో హిట్ అవ్వాలి. అప్పుడే ప్రాజెక్టు కే పై భారీ అంచనాలు ఉంటాయి. సలార్ హిట్ అయితేనే ప్రభాస్ అభిమానులకి.. ప్రభాస్ తర్వాత సినిమాలకి జోష్ ఉంటుంది. అప్పుడే ప్రభాస్ డిమాండ్ సజీవంగా ఉంటుంది.

ఇప్పుడు సలార్ ప్రశాంత్ నీల్‌కు.. ప్రభాస్ కు పెద్ద అగ్ని పరీక్ష. ఇప్పటికే సలార్‌లో శృతిహాసన్, పృధ్విరాజ్, సుకుమారన్, జగపతిబాబు లాంటి వాళ్ళు కీ రోల్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా యష్ కూడా గెస్ట్ రోల్ చేస్తే సినిమా మామూలుగా ఉండదు. ఇక ఇద్దరు హీరోలకు మధ్య ఒక అదిరిపోయే యాక్షన్ సీను కూడా ఉందట. ఇప్పుడు ఇద్దరు హీరోలు యూరప్ ట్రిప్ కోసం ఒకేసారి వెళ్లడంతో ఈ సినిమాలో య‌శ్ కూడా ఉన్నాడ‌న్న‌ది క‌న్‌ఫార్మ్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news