Moviesఫ్యాన్స్ కి ఊహించని షాకిచ్చిన బన్నీ.. ఏదో తేడా కొడుతుందే..!?

ఫ్యాన్స్ కి ఊహించని షాకిచ్చిన బన్నీ.. ఏదో తేడా కొడుతుందే..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గంగోత్రి సినిమాతో చాలా సైలెంట్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ స్టైలిష్ స్టార్ ఆ తర్వాత బన్నీ సినిమాతో తన రూట్ మొత్తం మార్చేశాడు. ఇక ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రెసెంట్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్లో సినిమాలో సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ఐకాన్ స్టార్ అంటూ ఓ ట్యాగ్ కూడా చేయించుకొని ప్రజెంట్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు .

అంతే కాదు సౌత్ ఇండస్ట్రీలోనే పుష్ప2 సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోగా పేరు సంపాదించుకుంటున్నారు . పుష్ప 2 సినిమా సెట్స్ పై ఉండగానే .. మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్ అంటూ తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు అర్జున్ రెడ్డి సినిమాతో సినిమా ఇండస్ట్రీ లెక్కలు మార్చేసిన సందీప్ రెడ్డి వంగ . ఎస్ 2025 లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారట . ఈ సినిమాకి భద్రకాళి పిక్చర్స్ అనే ప్రొడక్షన్ పేరు కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమా టైటిల్ కూడా వెరైటీగా ఉండబోతుంది అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇప్పటివరకు బన్ని నటించిన సినిమాలు టైటిల్స్ చూస్తే క్యాచీగా.. ఫన్నీగా జనాలకు వాడుక భాషలో ఉండే విధంగానే ఉంటాయి. అయితే ఈ సినిమాకి మాత్రం బన్నీ ఇప్పటివరకు ఎప్పటి పెట్టని ట్రెడిషనల్ సంప్రదాయ బద్ధంగా ఉండే పేరును అనుకుంటున్నారట . అంతేకాదు ఈ సినిమాలో బన్నీ లుక్స్ కూడా అదే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే బన్నీ అంటే అందరూ స్టైలిష్ ..ఫన్నీ.. క్యాచీ గానే ఊహించుకుంటారు .

సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ తో అల్లు అర్జున్ అంటే హీరోని అర్జున్ రెడ్డి 2 లానే భావిస్తారు . మరి ఇద్దరూ ఎందుకు ఈసారి పూర్తిగా ట్రెడిషనల్ వైపు వెళ్లడం అభిమానులకి కూసింత ఇబ్బందికరంగా ఉంది . అంతేకాదు ఇప్పటివరకు బన్ని ని మనం చూడని రోల్ లోనే సందీప్ రెడ్డి వంగ చూపించబోతున్నాడు అని తెలియడంతో బని ఫాన్స్ హ్యాపీగా ఉన్న కూసింత టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి పుష్ప 2 సినిమా హిట్ అయిన తర్వాత బన్నీ తన కెరీర్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news