Moviesతూచ్.. మెగాడాటర్ డివర్స్ లో బిగ్ ట్విస్ట్.. చైతన్య ఫోటోలు డిలిట్...

తూచ్.. మెగాడాటర్ డివర్స్ లో బిగ్ ట్విస్ట్.. చైతన్య ఫోటోలు డిలిట్ చేసింది అందుకే..!?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో మెగా డాటర్ నిహారిక డివర్స్ న్యూస్ ఏ రేంజ్ లో హల్చల్ చేస్తుందో హంగామా సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా బ్రదర్ నాగబాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ నిహారిక – జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకునే విషయం తెలిసిందే . అప్పట్లో వీళ్ళ పెళ్లి గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది . సెలబ్రిటీస్ కూడా కుళ్లుకునే రేంజ్ లో కోట్లి ఖర్చు చేసి కూతురు పెళ్లి చేశాడు నాగబాబు .

అంతేనా మెగా ఫ్యామిలీ మొత్తం ఏకధాటిగా నిలిచి నిహారిక పెళ్లిని గ్రాండ్గా చేసింది . పట్టుమంటూ నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైపోయారు ఈ జంట అంటూ వార్తలు వినిపించాయి . దానికి మెయిన్ రీజన్ జొన్నలగడ్డ చైతన్య – నిహారిక ఇద్దరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం . అంతేకాదు ఓ అడుగు ముందుకేసి జొన్నలగడ్డ చైతన్య ఏకంగా పెళ్లి ఫోటోలు డిలీట్ చేసేసాడు. ఈ క్రమంలోని నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే వార్తలు వినిపిస్తున్నాయి .

దాదాపు ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చి నాలుగు ఐదు రోజులు అవుతున్న ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ కానీ జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కానీ విడాకులపై స్పందించలేదు . ఈ క్రమంలోనే ఇన్సైడ్ మెగా కాంపౌండ్ నుంచి ఒక క్రేజీ మ్యాటర్ లీక్ అయింది . నిహారిక – చైతన్యల మధ్య గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమే అని .. అయితే అది డివర్స్ వరకు వెళ్లలేదని .. మెగాస్టార్ చిరంజీవి – చైతన్య ఫాదర్ ఇద్దరు మాట్లాడుతున్నారని ..యంగ్ ఏజ్ కావడంతో ఇద్దరు పిల్లలు వేడి మీద విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారని ..కానీ పెద్దరికంతో ఈ ఇద్దరు చిరంజీవి – చైతన్య ఫాదర్ వీళ్లను కలపడానికి ట్రై చేస్తున్నాడని .. ఆవేశంలో చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడని ఓ న్యూస్ లీక్ అయింది .

దీనితో మెగా అభిమానులు కూసింత రిలాక్స్ అవుతున్నారు . మెగా డాటర్ విడాకులు తీసుకోకుండా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే చాలా బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. చూడాలి మరి డివర్స్ పై నిహారిక – చైతన్య ఏ విధంగా కాంప్రమైజ్ అవుతారో..అభిమానులకు ఎలాంటి గుడ్ న్యూస్ అందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news