Moviesతూచ్.. ఇదంతా రియాలిటీ షో .. టీజర్ తో ట్వీస్ట్ ఇచ్చిన...

తూచ్.. ఇదంతా రియాలిటీ షో .. టీజర్ తో ట్వీస్ట్ ఇచ్చిన మంచు మనోజ్.. జనాలు వెర్రి పుష్పాలా బ్రదర్స్…?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మంచు బ్రదర్స్ మనోజ్ , విష్ణు ల పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గానే మంచు మనోజ్ మంచు విష్ణుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు మనోజ్ ఇంటికి వెళ్లి ఏకంగా మంచు విష్ణు దాడికి దిగడం .. ఆ వీడియోని స్వయాన మంచు మనోజే పోస్ట్ చేయడం ఇండస్ట్రీలో కలకలం రేపింది . ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటలకే నాన్న వార్నింగ్ తో మంచు మనోజ్ ఈ వీడియోని డిలీట్ చేశాడు .

ఈ వీడియో అప్పట్లోనే ఇద్దరు అన్నదమ్ములు క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు కామన్ అని .. అవి పెద్దదిగా చేసి చూడాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు. రీసెంట్గా మంచు మనోజ్ – మంచు విష్ణు అందరికీ షాక్ ఇస్తూ సరికొత్త టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ గొడవ అంత రియాల్టీ షోలో భాగంగానే జరిగిందని మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు .

ఈ క్రమంలోనే హౌస్ ఆఫ్ మంచూస్ అనే పేరుతో ఓ టీజర్ ని రిలీజ్ చేశారు . ఈ టీజర్ లో మంచు మనోజ్ – విష్ణు గొడవ ..మంచు మోహన్ బాబు బిహేవియర్ వైరల్ అవుతున్నాయి . అయితే ఈ వీడియోలో ఎక్కడా కూడా మంచు మనోజ్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ వీడియోలో మంచు విష్ణు పిల్లలు .. అతని భార్య మోహన్ బాబు మాత్రమే కనిపిస్తున్నారు . దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ పై మీమ్‌స్ తో ఆడేసుకుంటున్నారు కొందరు ట్రోలర్స్. కాగా దీనిపై కొందరు జనాలు కూడా మంచు విష్ణుని ట్రోల్ చేస్తున్నారు . ఫ్యామిలీలో ఇంత గొడవ జరిగి లాస్ట్ కి టీజర్ రియాలిటీ షో అంటావా ..? జనాలు అంత వెర్రి పుష్పాలా కనిపిస్తున్నారా ..? అంటూ ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news