Moviesఆ బ‌బ్లీ హీరోయిన్‌తో టాలీవుడ్ హీరో చెట్టాప‌ట్టాల్‌.. సీక్రెట్‌గా హైద‌రాబాద్‌లో డేటింగ్‌…!

ఆ బ‌బ్లీ హీరోయిన్‌తో టాలీవుడ్ హీరో చెట్టాప‌ట్టాల్‌.. సీక్రెట్‌గా హైద‌రాబాద్‌లో డేటింగ్‌…!

సినిమా ఇండ‌స్ట్రీలో యంగ్ హీరోలు, హీరోయిన్ల మ‌ధ్య స్నేహాలు, డేటింగ్‌లు ఇప్పుడు కామ‌న్ అయిపోయాయి. ఎవ‌రు ? ఎవ‌రితో ఎప్పుడు ఈ ప‌నిలో ఉంటారో ? ఎప్పుడు బ్రేక‌ప్ చెప్పేసుకుంటారో ? కూడా తెలియ‌ట్లేదు. రీసెంట్‌గా మ‌న హైద‌రాబాదీ అమ్మాయి అదితిరావు హైద‌రీ, సీనియ‌ర్ హీరో సిద్ధార్థ్ డేటింగ్‌లో ఉండ‌డంతో పాటు త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నారంటూ క్లారిటీ వ‌చ్చేసింది.

హీరో శ‌ర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు కూడా వీరిద్ద‌రు క‌లిసి హాజ‌రు కావ‌డంతో వీరి డేటింగ్ విష‌య‌మై చాలా మందికి ప‌క్కాగా క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు వీళ్ల‌లాగానే ఓ యంగ్ హీరోయిన్‌, మ‌రో ఇన్నోసెంట్ హీరో ఇద్ద‌రూ డేటింగ్లో మునిగి తేలుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్ విష‌యానికి వ‌స్తే బ‌బ్లీ హీరోయిన్‌గా మెరుపులాంటి చూపుల‌తో ఉంటోంది.

కాస్త ఒళ్లు చేసి నున్న‌గా ఉన్నా న‌ట‌న‌తో పాటు అందంలోనూ తీసిపోదు. ఆమె తెలుగులో ఒక‌రిద్ద‌రు స్టార్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తోనూ కొన్ని సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు డేటింగ్ చేస్తోన్న హీరోతో ఓ సినిమా చేసింద‌ట‌. అప్ప‌టి నుంచే ఇద్ద‌రి మ‌ధ్య క్లోజ్‌నెస్ పెరిగి అది చివ‌ర‌కు సీక్రెట్‌గా డేటింగ్ చేసే వ‌ర‌కు వెళ్లింద‌ట‌. వీరిద్ద‌రు క‌లిసి హైద‌రాబాద్‌లోని ఓ ప్లాట్‌లోనే గుట్టుచ‌ప్పుడు కాకుండా య‌వ్వారం మొద‌లు పెట్టేశారంటున్నారు.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ విష‌యం ఇప్పుడు రెండు కుటుంబాల్లోనూ అంగీకార‌మే అని.. ఏదో ఓ రోజు వీరు పెళ్లి విష‌యం చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కూడా తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పుడు అంతా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఈ కుర్ర జంట కూడా పెళ్లిపీట‌లు ఎక్క‌డంలో ఆశ్చ‌ర్యం ఏమీ లేక‌పోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news