Moviesప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏకంగా ప్రివ్యూ చూసిన బాల‌య్య 2 బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇవే…!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏకంగా ప్రివ్యూ చూసిన బాల‌య్య 2 బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇవే…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ 2 స‌క్సెస్ అయ్యింది. ఇప్ప‌టికే ప‌లు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా.. రీసెంట్‌గా ప‌వ‌ర్ ప్యాక్డ్ ఎపిసోడ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ది కూడా ఫ‌స్ట్ పార్ట్ స్ట్రీమింగ్ అయ్యింది. గ‌త రాత్రి స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ద‌ద్ద‌రిల్లిపోయేలా ఉంది. ఎపిసోడ్ ఆద్యంతం చాలా స‌ర‌దాగా న‌డిచిపోయింది. సాయిధ‌ర‌మ్ తేజ్‌తో కూడా బాల‌య్య స‌ర‌దాగా మాట్లాడుతూ ఆట ప‌ట్టించాడ

బాల‌య్య వేసిన చాలా ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ న‌వ్వుతూ, సిగ్గుప‌డుతూ ఆన్స‌ర్ చేశాడు. అలాగే మ‌న‌మిద్ద‌రం బ‌య‌ట క‌లుసుకోమ‌ని.. పెద్ద‌గా మాట్లాడుకోమ‌ని చాలామంది అనుకుంటూ ఉంటారు.. పైగా మ‌నం ఇప్పుడే ఫ‌స్ట్ టైం క‌లుసుకున్నామ‌న్న ఫీలింగ్ కూడా చాలా మందికి ఉంద‌ని అంటూనే గ‌తంలో ప‌వ‌న్ – బాల‌య్య ఎప్పుడెప్పుడు ఎక్క‌డెక్క‌డ క‌లుసుకున్నారో ? అవ‌న్నీ ముచ్చ‌టించుకున్నారు.

ఇక సుస్వాగ‌తం సినిమా ప్రారంభోత్స‌వం టైంలో కూడా బాల‌య్య‌, ప‌వ‌న్ క‌లుసుకున్న విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఆ ఫొటో కూడా ప్లే చేసి చూపించారు. ఇక బాల‌య్య నా సినిమాలు థియేట‌ర్ల‌లో చూస్తుంటావుగా అని వేసిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ మీరు న‌టించిన సినిమాల ప్రివ్యూలు కూడా చూశాన‌ని ప‌వ‌న్ గుర్తు చేసుకున్నాడు.

ప‌వ‌న్ మ‌ద్రాస్‌లో ఉన్న‌ప్పుడు జంధ్యాల గారు డైరెక్ట్ చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సీతారామ క‌ళ్యాణం ప్రివ్యూ చూశాన‌ని.. అలాగే సింగీతం శ్రీనివాస‌రావు డైరెక్ట్ చేసిన ఆదిత్య 369 సినిమా కూడా చూశాన‌ని ప‌వ‌న్ చెప్పాడు. ఇక ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల గురించి కూడా బాల‌య్య వేసిన ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ పెద్ద‌లు బాల‌య్య గారి మీద ఉన్న గౌర‌వంతో ఆన్స‌ర్ చేస్తున్నాన‌ని సుధీర్ఘంగా దాని గురించి మాట్లాడాడు.’

అస‌లు తాను పెళ్లే చేసుకోవాల‌ని అనుకోలేద‌ని.. స‌న్యాసం తీసుకోవాల‌ని అనుకున్నాన‌ని.. అయితే నా జీవితంలో కావాల‌ని కాకుండా అలా జ‌రిగిపోయింద‌ని చెప్పాడు. తాను మూడు పెళ్లిళ్లు ఒకేసారి చేసుకోలేదని.. అనేక కార‌ణాల నేప‌థ్యంలో ఒక‌రికి విడాకులు ఇచ్చాకే మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news