MoviesJagapathi Babu Father జ‌గ‌ప‌తిబాబు తండ్రికి, ఏఎన్నార్‌కు మ‌ధ్య గొడ‌వ పెట్టిన...

Jagapathi Babu Father జ‌గ‌ప‌తిబాబు తండ్రికి, ఏఎన్నార్‌కు మ‌ధ్య గొడ‌వ పెట్టిన హీరోయిన్‌…!


టాలీవుడ్ దిగ్గజ‌ నటుల్లో ఒకరు అయిన దివంగత అక్కినేని నాగేశ్వరరావు తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. నాగేశ్వరరావు స్టార్ హీరో అవ్వటానికి ఆయన గురువుగా భావించే దుక్కిపాటి మధుసూదనరావు ఒకరు. గూడవల్లి రామబ్రహ్మం, దుక్కిపాటి మధుసూదనరావు లాంటివారితో ఏఎన్ఆర్ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యి ఆయన్ను తిరిగిలేని స్టార్ హీరోగా నిలబెట్టేసాయి. ఆ తర్వాత జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి. రాజేంద్రప్రసాద్. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబుకు ఆయన స్వయాన తండ్రి కావటం విశేషం. తన కొడుకు జగపతిబాబు పేరుమీద జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి రాజేంద్రప్రసాద్ ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. బాలకృష్ణతో బంగారు బుల్లోడు లాంటి బ్లాక్ బ‌స్టర్ హిట్ సినిమా కూడా ఆయన నిర్మించారు. అయితే రాజేంద్రప్రసాద్ తన బ్యానర్లో ఎక్కువగా ఏఎన్ఆర్ తోనే సినిమాలు తీశారు. అలాగే దసరా బుల్లోడు లాంటి సూపర్ హిట్ సినిమాను ఆయన స్వీయ నిర్మాణంలో నిర్మించి.. దర్శకత్వం వహించటం విశేషం.

ఈ సినిమా కథ రెడీ అయ్యాక మరో డైరెక్టర్ తో సినిమా చేయాలని అనుకున్నారు. అప్పుడు ఆ డైరెక్టర్ ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో సినిమాను వాయిదా వేద్దామని రాజేంద్రప్రసాద్ ఏఎన్ఆర్ తో చెప్పారు. నువ్వు దర్శకత్వం వహిస్తే ఈ సినిమా నేను చేస్తాను.. లేకపోతే చేయను అని ఏఎన్ఆర్ ఖ‌రాకండిగా చెప్పేశారు. దీంతో రాజేంద్రప్రసాద్ మెగాఫోన్ పట్టి దసరా బుల్లోడు సినిమాను జనరంజకంగా తీర్చిదిద్ది సూపర్ డూపర్ హిట్ కొట్టారు.

ఏఎన్ఆర్ – విబి.రాజేంద్రప్రసాద్ మధ్య ఎంతో బలమైన స్నేహం ఉండేది. అయితే ఒకానొక సందర్భంలో వీరి మధ్య కూడా మాటల తూటాలు పేలాయ‌ట. రాజేంద్రప్రసాద్ ఒక హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నాడు అనే విషయాన్ని ఏఎన్ఆర్ ఇతరుల వద్ద ప్రస్తావించారట. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలిసింది. దీంతో ఆయన నేరుగా వెళ్లి నేను మీతో ఎంతో స్నేహంగా ఉంటున్నాను కదా ? ఆ హీరోయిన్ కు నాకు మధ్య ఏదో ఉందని మీరు ఇతరుల వద్ద ప్రస్తావించిన ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది ? నన్నే అడగొచ్చు కదా అని మొహం మీదే అడిగేశారట.

దీంతో నాగేశ్వరరావు కాస్త నొచ్చుకున్నారట. అలా ఇద్దరు మధ్య ఈ విషయమై కొద్దిరోజులపాటు ప్రచ్చన్న యుద్ధం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు కొన్నాళ్లపాటు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి… ఇప్పుడు సీనియర్ నటుడిగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news