MoviesNamratha న‌మ్ర‌త‌ను కాకాప‌డుతోన్న స్టార్ హీరోయిన్‌ .. వామ్మో మ‌హేష్...

Namratha న‌మ్ర‌త‌ను కాకాప‌డుతోన్న స్టార్ హీరోయిన్‌ .. వామ్మో మ‌హేష్ కోసం ఇంత పెద్ద స్కెచ్ వేసిందా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు వ‌రుస విజ‌యాల‌తో ఫామ్‌లో ఉన్నాడు. గ‌త స‌మ్మ‌ర్‌లో స‌ర్కారువారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నాలుగో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా వ‌చ్చి 9 నెల‌లు అవుతున్నా మ‌హేష్ కొత్త సినిమా ఇంకా స్పీడ‌ప్‌గా లేదు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది

అలాగే యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో రు. 500 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక మ‌హేష్‌బాబుతో ఒక్క సినిమాలో అయినా హీరోయిన్‌గా న‌టించాల‌ని ఎంతోమంది హీరోయిన్లు కోరుకుంటారు. అంతటి గొప్ప అందం మ‌న సూప‌ర్‌స్టార్‌ది.

ఈ క్ర‌మంలోనే ఓ యంగ్ హీరోయిన్ కూడా ఇప్పుడు మ‌హేష్‌కు జోడీగా న‌టించాల‌ని ఆశ‌ప‌డుతోంది. అందుకోసం మ‌హేష్‌తో పాటు న‌మ్ర‌త‌ను కూడా కాకాప‌ట్టే ప‌నిలో ప‌డింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు ఢిల్లీబెల్లి రాశీఖ‌న్నా. అవ‌స‌రాల శ్రీనివాస్ ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు వెబ్‌సీరిస్‌లు కూడా చేస్తోంది. రీసెంట్ ఆమె స్టార్స్ షాహిద్ క‌పూర్‌, విజ‌య్ సేతుప‌తి, కేకే మీన‌న్ లాంటి స్టార్ట‌ల‌తో క‌లిసి వెబ్ సీరిస్‌లో పోలీస్ అధికారిణిగా క‌నిపించింది.

ఈ క్ర‌మంలోనే ఆమెను నెట్ చాటింగ్‌లో ఓ ఫ్యాన్ మ‌హేష్‌బాబుతో ఎప్పుడు సినిమా చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు ఆమె స్ట‌న్నింగ్ ఆన్స‌ర్ చేసింది. తాను మ‌హేష్‌బాబుకు ఎంతో పెద్ద అభిమానిని అంటూనే.. ఈ విష‌యాన్ని తాను ఎన్నోసార్లు చెప్పాన‌ని తెలిపింది. రీసెంట్‌గా తాను మ‌హేష్‌, న‌మ్ర‌త గార్ల‌ను క‌లిసిన మూమెంట్ ఎప్పుడూ మ‌ర్చిపోలేనంటూనే న‌మ్ర‌త‌పై పొగ‌డ్త‌లు కురిపిస్తూ మురిసిపోయింది.

ఇక మ‌హేష్ గారితో సినిమా చేసేందుకు ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నా అని… దేవుడి ద‌య‌తో త్వ‌ర‌లోనే ఆ అవ‌కాశం వ‌స్తుంద‌ని చెప్పింది. ఏదేమైనా రాశీ న‌మ్ర‌త‌ను కూడా ఆకాశానికి ఎత్తేయ‌డం చూస్తుంటే అటు వైపు నుంచి న‌రుక్కొస్తోంది. మ‌రి ఇలా అయినా మ‌హేష్‌తో ఆమెకు ఛాన్స్ వ‌స్తుందా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news