Moviesబ్ర‌ద‌ర్ ఇది మంచి ప‌ద్ధ‌తి కాదు… ఆ హీరోకు ఎన్టీఆర్ స్ట్రాంగ్...

బ్ర‌ద‌ర్ ఇది మంచి ప‌ద్ధ‌తి కాదు… ఆ హీరోకు ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్‌…!

ఎన్టీఆర్ సినీ రంగంలో అనేక మంది మార్గ‌ద‌ర్శి. ఆయ‌న ప్ర‌ముఖ న‌టుడే కాదు.. ద‌ర్శ‌కుడు, క‌థ‌కుడు కూడా.. అదేస‌మ‌యంలో ఆయ‌న అనేక మంది న‌టీన‌టుల‌కు ఆర్థిక మార్గ‌ద‌ర్శిగా కూడా నిలిచారు. ఆయ‌న సూచ‌న‌లు పాటించిన వారు పెద్ద ఎత్తున డ‌బ్బులు సంపాయించుకుని ఆర్థికంగా ఓ వెలుగు వెలిగారు. ఆయ‌న సూచ‌న‌లు పాటించ‌కుండా.. త‌మ ప‌థాన్నే ఎంచుకుని న‌డిచిన వారు ఇబ్బందులు ప‌డ్డారు.

ఇలాంటి వారిలో క‌త్తి కాంతారావు ఒక‌రు. ఆయ‌న‌కు , రామారావుకు బ్ర‌ద‌ర్‌-బ్ర‌ద‌ర్ అనేంత చ‌నువుంది. అనేక చిత్రాల్లో క‌లిసికూడా న‌టించారు. ఏసినిమాలో అయినా.. రామారావుకు త‌మ్ముడిగా న‌టించ‌డం అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పుకొనే వారు. ర‌క్త‌సంబంధం సినిమాలో అయితే.. బావ‌గా న‌టించారు. ఇక‌, ఆర్థిక విష‌యాలకు వ‌స్తే.. తను నటించిన సినిమాలకు పారితోషికం.. ఇంత అని తీసుకునేవారు కాద‌ట‌.

ఇదే విష‌యాన్ని అన్న‌గారు ఎన్నో సంద‌ర్భాల్లో హెచ్చ‌రించారు. మీరు క‌ష్ట‌ప‌డుతున్నారుగా బ్ర‌ద‌ర్స్‌.. మీ పారితోషికాన్ని అడిగి తీసుకోండి! అని చెప్పేవార‌ట‌. కానీ, కాంతారావు మాత్రం అడిగేవారుకాదు. దీంతో కాంతారావు పారితోషికం విష‌యంలో నిర్మాతలు ఎంత ఇస్తే.. అంతే తీసుకుని జేబులో వేసుకునేవారు. ఈ ఆర్థిక ప‌రిస్థితి కాంతారావును ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పారితోషికం.. స‌రిపోయేది కాదు. దీంతో తన ఆస్తులన్నీ అమ్మి, అప్పులు తీర్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

చిట్టచివరి ప్రయత్నంగా తీసిన ‘స్వాతిచినుకులు’ చిత్రం కూడా భారీ పరాజయం పాలు కావడంతో ఒక్కసారిగా ఆయన వీధిన పడాల్సివచ్చింది. ఆయన దీనావస్థ గురించి తెలుసుకున్న తర్వాత, హీరో రజనీకాంత్ నెలానెలా ఐదువేలు పంపించేవారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తొమ్మిదేళ్లపాటు నెలకు ఐదువేల రూపాయలు పంపించారు. ఇలా.. అన్నగారి ఆర్థిక సూచ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతోనే తాను ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న చెప్పుకొనేవారు.

చివరిరోజుల్లో ఆయన చిన్నదే అయినా ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశించారు. తను స్వాతంత్య్ర‌ సమరంలో పాల్గొన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తనను సమరయోధుడిగా గుర్తించాలని ఆశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ అవార్డు తనకూ వస్తుందని ఎదురు చూశారు. కానీ, ఇవేవీ ఆయ‌న‌కు ద‌క్క‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news