MoviesSenior Heroes కక్కిన కూడు కోసం ఆశపడుతున్న స్టార్ హీరోస్.. ఇదేం...

Senior Heroes కక్కిన కూడు కోసం ఆశపడుతున్న స్టార్ హీరోస్.. ఇదేం పోయేకాలం రా బాబులు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . వేరే భాషలో డైరెక్ట్ చేసి..తెరకెక్కించి జనాలుకు నచ్చి ..సినిమా హిట్ కొట్టిన సినిమాని మళ్లీ మన స్టార్ హీరోలు ఆ సినిమాపై లుక్కేసి ఏదో కొన్ని లైన్స్ మార్చి రీమేక్ సినిమాగా తెలుగులో రిలీజ్ చేయడం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి కుర్ర హీరోల వరకు ఇదే తంతు ఫాలో అవుతున్నారు .

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ స్టార్ సీనియర్ హీరోలపై మండిపడుతున్నారు. గతంలో మీరు నటించిన సినిమాలు ఎలా ఉన్నాయో గుర్తు చేసుకోండి . బాక్సాఫీస్ రికార్డును తిరగరాసే మన తెలుగు సినిమాలను పక్క భాష వాళ్ళ రీమేక్ చేసే స్థాయికి మనం ఎదిగాం. అయితే మీరు దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. పక్క భాషలో రిలీజ్ అయిన హిట్ కొట్టిన సినిమాని మనం రీమిక్స్ చేయడమేంటి . ఇది కక్కిన కూడుకు ఆశపడిందే కదా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు .

ఈ క్రమంలోనే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి రీమిక్ సినిమాగా నటించిన గాడ్ ఫాదర్ ..త్వరలోనే నాగార్జున నటించబోయే రీమేక్ సినిమా నీ సైతం జనాలు ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు వెంకటేష్ , పవన్ కళ్యాణ్ ని సైతం ఇదే విషయంలో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాల పై ఇంట్రెస్ చూపిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో జనాలు బాయ్ కాట్ రీమేక్ మూవీస్ అంటూ సరికొత్త హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు . కనీసం ఇప్పటికైనా మన హీరోలు మారి కొత్త కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు . చూద్దాం మన హీరోలు ఏ విధంగా ఆలోచనలు మార్చుకుంటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news