MoviesNandamuri Tarakaratna :తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌... అలేఖ్య రెడ్డి ఏం చేసిందో...

Nandamuri Tarakaratna :తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌… అలేఖ్య రెడ్డి ఏం చేసిందో చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వ్ ( వీడియో)

నందమూరి హీరో తారకరత్న మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. కేవలం 40 సంవత్సరాల వయసులో ఎంతో ఉజ్వలమైన, సినీ రాజకీయ భవిష్యత్తు ఉన్న తారకరత్న మృతి చెందటం ప్రతి ఒక్కరిని ఎంతో కలచివేసింది. తారకరత్న మరణంతో మిగిలిన వారు ఎంత బాధ పడుతున్నారో ?అంతకుమించి బాధ ఆయన భార్యా పిల్లలకు ఉంది. భర్త దూరం కావడంతో ముగ్గురు పిల్లలను తలచుకుని భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరో విషాదకర విషయం ఏంటంటే తారకరత్న పుట్టినరోజుకు కేవలం మూడు రోజుల ముందే ఆయన కన్నుమూయ‌డంతో అలేఖ్యరెడ్డి మరింత కృంగిపోయింది. ఫిబ్రవరి 22న తన భర్త పుట్టినరోజు సందర్భంగా అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఫిబ్రవరి 22 తారకరత్న 40వ పుట్టినరోజు. ఆయన పుట్టిన‌రోజు సందర్భంగా తారకరత్న తన కూతురు నిషిక‌తో ఉన్న ఫోటోను త‌న సోష‌ల్‌ మీడియాలో షేర్ చేశారు. నా జీవితంలో ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

హ్యాపీ బర్త్ డే నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. అంటూ తన ఇన్‌స్టాలో ఆమె షేర్ చేశారు. అలాగే నందమూరి, తెలుగుదేశం అభిమానులతో పాటు తెలుగు ప్రజల ప్రతి ఒక్కరూ తారకరత్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న నిన్ను మిస్ అవుతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే బుధవారం తారకరత్న చిన్న కర్మ చేశారు. ఈ కార్యక్రమంలో తారకరత్న తల్లిదండ్రులు… భార్య పిల్లలతో పాటు నందమూరి బాలకృష్ణ కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరు హాజరయ్యారు.

భార్య అలేఖ్య రెడ్డి తన భర్త చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భర్త ఇక లేరన్న విషయాన్ని తలుచుకుని ఆమె తట్టుకోలేకపోతున్నారు. చిన్నకర్మ సందర్భంగా భర్త చిత్రపటాన్ని చూసి ఎక్కెక్కి ఏడ్చారు. తన తల్లిని ఓదార్చేందుకు కుమార్తె నిషిక‌ ఎంత ప్రయత్నించినా కూడా అలేఖ్య కన్నీళ్లు ఆగలేదు. భర్త లేకుండానే భవిష్యత్తును కొనసాగించాలన్న బాధ ఆమెను నిలువెల్లా దహించి వేస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారు. అలేఖ్య బరువెక్కిన గుండెతో కన్నీళ్ళతో చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు. ఆ దృశ్యాన్ని చూసిన అక్క‌డున్న వారి గుండె తరుక్కుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news