MoviesNandamuri Kalyanram అంతా షాక్‌… ఆ హీరోయిన్‌కు ఓపెన్‌గానే ప్ర‌పోజ్ చేసిన...

Nandamuri Kalyanram అంతా షాక్‌… ఆ హీరోయిన్‌కు ఓపెన్‌గానే ప్ర‌పోజ్ చేసిన క‌ళ్యాణ్‌రామ్‌..!

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ గ‌తేడాది చివ‌ర్లో Nandamuri Kalyanram బింబిసార లాంటి సోషియో ఫాంట‌సీ సినిమాతో సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. వసూళ్ల ప‌రంగా కూడా బింబిసార స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తోన్న సినిమా అమిగోస్‌. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను పెద్ద బ్యాన‌ర్ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.

Nandamuri Kalyanram

మైత్రీ మూవీ సంస్థ‌, క‌ళ్యాణ్‌రామ్ కాంబినేష‌న్ అన‌గానే ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో చెప్పక్క‌ర్లేదు. దీనికి తోడు ఈ సినిమా స్టిల్స్‌, ట్రైల‌ర్లు, క‌ళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభిన‌యం అన్ని సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. ఈ సినిమాకు ఎప్పుడో రు. 9 కోట్ల‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ పూర్త‌య్యింది. ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో సినిమా యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచేసింది.

Nandamuri Kalyanram
Nandamuri Kalyanram

ఈ క్ర‌మంలోనే గ‌త రాత్రి జ‌రిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌చ్చాడు. అటు క‌ళ్యాణ్‌రామ్ కూడా సినిమా ప్ర‌మోష‌న్లు హోరెత్తిస్తున్నాడు. బుల్లితెరపై ఓ షోకు గెస్టుగా వెళ్లిన క‌ళ్యాణ్‌రామ్ ఓ ఫ‌న్నీ టాస్క్‌లో భాగంగా హీరోయిన్ అషిక రంగ‌నాథ్‌కు ల‌వ్ ప్ర‌పొజ్ చేశాడు. దీంతో అంద‌రూ షాక్ అయ్యారు.

Nandamuri Kalyanram

మీ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను.. అంటూ రెడ్ రోజ్ ఇచ్చి క్యూట్‌గా ప్ర‌పొజ్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news