MoviesRam Charan చరణ్ ని చూసి కుళ్ళుకుంటున్న స్టార్ హీరోలు .....

Ram Charan చరణ్ ని చూసి కుళ్ళుకుంటున్న స్టార్ హీరోలు .. ఓ హీరోకి ఇంతకన్నా ఏం కావాలి బాసూ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోస్ ఉన్నా.. జనాలకు మాత్రం కొంతమంది హీరోలంటే మహా పిచ్చి ఉంటుంది. ఆ హీరో పేరు చెప్పగానే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే ఈ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిరుత సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . అయితే మెగాస్టార్ రేంజ్ అంత స్థాయికి ఎదుగుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాగా ఇప్పుడు రాంచరణ్ సినిమాలో చేస్తూ తండ్రికి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు.

నిజానికి ఓ తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రాంచరణ్ ..ప్రెసెంట్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నాడు . కాగా సినిమాలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాంచరణ్ సోషల్ మీడియాలో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు . ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ ఏకంగా 12 మిలియన్లు దాటేశారు. అతి తక్కువ పోస్టులు పెట్టినప్పటికీ తక్కువ టైంలోనే ఇంతటి క్రేజ్ ని దక్కించుకున్న స్టార్ హీరోగా సంచలన రికార్డును క్రియేట్ చేశాడు రామ్ చరణ్ .

ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుంది ..ఇంతమంది ఫాలోవర్స్ పెరగడానికి అది కూడా ఓ రీజన్ అంటున్నారు సినీ విశ్లేషకులు . మరోవైపు ట్విట్టర్ లోను దాదాపు మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు . ఈ విధంగా చూసుకుంటే చిరంజీవిని మించిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ .నిజమైన హీరో కి ఉండాల్సిన గుర్తింపు అదే ..సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సోషల్ మీడియాలో అభిమానులు ఆదరిస్తే అంతకన్నా గొప్ప విషయం ఏమంటుంది. అత్యధికంగా 19.9 అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకొని మొదటి ప్లేస్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news