Moviesమెగా ఇంటికి కాబోయే కోడలు నేనే .. టంగ్ స్లిప్ అయిన...

మెగా ఇంటికి కాబోయే కోడలు నేనే .. టంగ్ స్లిప్ అయిన లావణ్య..!!

సినిమా ఇండస్ట్రీలో గాసిప్ లు సర్వసాధారణం. ఓ స్టార్ హీరో హీరోయిన్ కలిసి తెర పై కనిపించారంటే చాలు.. వాళ్ళ మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు వచ్చేస్తాయి. ఇక వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతే చెప్పనవసరమే లేదు జనాలు నానా హంగామా చేస్తారు . అయితే ఆ వార్తలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ జంట హద్దుల మీరి ప్రవర్తిస్తే పరిస్ధితి మరింత దారుణంగా ఉంటుంది . కాగా సోషల్ మీడియాలో అలాంటి కామెంట్స్ నే అందుకుంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి .

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కలిసి చేసిన మిస్టర్ , అంతరిక్షం సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. కానీ కెమిస్ట్రీ మాత్రం సూపర్ టాక్ అని వచ్చింది . అంతేకాదు వీరిద్దరూ ప్రైవేట్ గా కూడా పలు పార్టీలో కలుసుకోవడంతో .. ఇద్దరు జంట ప్రేమించుకుంటున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి . కాగా దీనిపై నాగబాబు – లావణ్య త్రిపాఠి అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన .. రీసెంట్గా లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ మరోసారి ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయింది.

లావణ్య త్రిపాఠి రీసెంట్గా నటిస్తున్న సినిమా “పులిమేక” ఇందులో బిగ్ బాస్ బ్యూటి సిరి కూడా ఓ రోల్ లో నటిస్తుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డ షోకి అటెండ్ అయ్యారు చిత్ర బృందం. ఈ క్రమంలోని టాస్క్ లో భాగంగా లావణ్య త్రిపాఠి ని ప్రశ్నించింది సుమ. మోస్ట్ హ్యాండ్సమ్‌ హీరో ఎవరని అడితే మీరు ఎవరి పేరు చెప్తారు అంటూ ఏ-నాని, బీ-వరుణ్‌ తేజ్‌ పేర్లు చెప్పింది సుమ. దీనికి లావణ్య త్రిపాఠి రియాక్ట్ అవుతూ, వరుణ్ తేజ్‌ పేరు చెప్పింది. దీనికి అక్కడ ఉన్న సిరి-కోన వెంకట్ షాక్ అయిపోయారు.. ఆడియన్స్ కూడా ఓ …..అంటూ అరిచేశారు. దీంతో మెగా ఇంటికి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి నే అని చెప్పకనే చెప్పేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news